Collection RRR : ఆర్ఆర్ఆర్ గురించి రోజు ఒక వార్త ఉండనే ఉంటోంది. అన్ని రికార్డులు బద్ధలుకొట్టింది. ఇంత వసూళ్లతో దూసుకుపోతోంది అంటూ ఊదరగొడుతున్నారు. అయితే ఇందులో నిజమెంత ఆలు కలెక్షన్స్ ఎంత అన్నది మాత్రం సరిగా ఎవరికీ తెలియదు. అయితే సినిమా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది ఇది వాస్తవం. బాలీవుడ్ లోనూ మంచి కలెక్షన్స్ అయితే సంపాదించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను మంచి లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అయితే బాహుబలి అంతిమ కలెక్షన్లను ఈ సినిమా దాటదని కన్ఫర్మ్ అయిపోయింది.
నిజాం వసూళ్ళ లెక్కల్లో తేడాలు దిల్ రాజు చెప్తున్నది వాస్తవం కాదా….
ఇక తెలుగురాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ ఒక్క నిజాం లోనే 100కోట్లు వసూలు చేసిందని ఆ మధ్య దిల్ రాజు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చాడు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి. అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవట నిజాం లో ఆర్ఆర్ఆర్ 100కోట్లు వసూళ్లు చేయలేదట కేవలం 87కోట్లు మాత్రమే వసూళ్లు జరిగాయట. ఇక ఈ ముక్క చెప్పింది ఎవరో కాదు అక్కడి డిస్ట్రిబ్యూటర్లే. ఆ రూ.100 కోట్ల పైన షేర్ మాట ఏంటి? అంటే జీఎస్టీ కాకుండా వచ్చిన నెట్ ను షేర్ గా ప్రచారం చేస్తున్నారట. అదన్నమాట విషయం. అయితే 87కోట్లు వసూలు చేయడం కూడా మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమా విషయంలో మాత్రమే కాదు ఇటీవల విడుదలైన అన్ని సినిమాల విషయంలో కూడా ఇలాంటి వాదనే వినిపిస్తుంది. జీఎస్టీ కాకుండా షేర్ చేసుకోవడంతో సినిమా ఫలానా సినిమా రికార్డులు కొట్టేసింది అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే రూ.1030 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టింది ఆర్ఆర్ఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…