RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా.. పాపం వాళ్ల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..!
RRR Postpone: ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు.. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జనవరి 7న దాదాపు విడుదల అవుతుందనే అనుకున్నారు. కాని అనూహ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. మంచి టైమ్‌లో ఇండియన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలియజేసింది. ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని.. ఇటువంటి సందర్భంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదనేది మేకర్స్ భావించారు. మళ్లీ పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటనలో తెలిపారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. ఆ సినిమా థియేటర్ దగ్గర ఉండే.. చిన్న చిన్న కిరాణా దుకాణాలతో పాటు.. రవాణా రంగానికి కూడా ఉపయోగం ఉంటుంది. సినిమా చూడటానికి ఎక్కడి నుంచో ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్ దగ్గరకు వస్తారు. ఇలా వారికి పరోక్షంగా ఉపాధికి అవకాశం ఏర్పడుతుంది. అయితే.. అన్నింటికంటే ముఖ్యంగా థియేటర్ దగ్గర తమ అభిమాన హీరోకు సంబంధించి కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. దానికి ఫ్లెక్స్ లల్లో తమ ఫొటోలను ముద్రించి.. సినిమా థియేటర్ దగ్గర తమ అభిమానాన్ని చాటుకుంటారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ఇక వారం రోజులు మాత్రమే ఉండగా.. కొన్ని థియేటర్ల దగ్గర ఇప్పటికే ఫ్లెక్స్ లు వెలిశాయి. మరికొన్ని ఆర్డర్ ఇచ్చి.. మరీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా ఆర్డర్ ఇచ్చిన వాటిని మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడంతో అటు ఫ్యాన్స్.. వాటిని తయారు చేసేవాళ్లు నష్టపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించి కటౌట్లు, ఫ్లెక్సీలు ఆర్డర్ అంతా ఓకె అయిన తర్వాత సడన్ గా సినిమా వాయిదా అనగానే.. వాటిని తయారు చేయడానికి పడిన కష్టం, ఖర్చు మొత్తం నీటిలో పోసిన పన్నీరుగా మారిపోయింది. దీనికి సంబంధించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. అందులో ఎక్కడివి అక్కడే కటౌట్లు, ఫ్లెక్సీలు పడి ఉన్నాయి. వాళ్లు ఇంకా వాయిదా పడిన విషయం తెలుసో.. తెలియదో కానీ.. ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ వాయిదా అనేది అందరికీ నష్టాలను తెచ్చిందనే చెప్పాలి. మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు.. మీరు ఎప్పుడు వచ్చిన కలెక్షన్స్ మాస్ వస్తాయ్.. కానీ మాకు మీ మీద నమ్మకం పోయింది అంటూ నెటిజన్స్ ఆవేదనతో కామెంట్లు పెడుతున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…