Categories: FeaturedMovie News

అప్పట్లో సొంత విమానం కలిగిన మొట్టమొదటి నటి కెఆర్ విజయ.. ఆమె ఎంత సంపన్నురాలో తెలుసా?

పాత తరం హీరోయిన్లలో అందానికి, అభినయానికి పుత్తడిబొమ్మ లాంటి నటి కే .ఆర్. విజయ. ఈవిడ అసలు పేరు దేవ నాయకి. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ లో ఫిబ్రవరి 19, 1947 న జన్మించారు. తన తండ్రి అచ్చ తెలుగు వారు, వారిది చిత్తూరు. కే .ఆర్. విజయ వారి తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. ఆమెకు మొత్తం నలుగురు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈవిడ త్రిశూర్ లోని పున్కున్నం సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. అయితే ఆవిడ తండ్రి ఓ మంచి నటుడు, కళాభిమాని కావడంతో అప్పట్లో ప్రముఖ నటుడు రాధా కృష్ణన్ ఓ డ్రామా కంపెనీ స్థాపించడంతో అందులో దేశ భక్తి పూర్వక నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. దీనితో కే .ఆర్. విజయ కు కూడా నటన పట్ల ఆసక్తి కలిగింది. దీనితో ఆమె తన 17 వ ఏటనే విజయ తమిళ దర్శక నిర్మాత కె ఎస్ గోపాలకృష్ణన్ అమర్ జ్యోతి పథకం మీద నిర్మించిన కర్పగం అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు.

ఇలా ఉండగా 1964లో గోపాలకృష్ణన్ ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ చిట్ ఫండ్ కంపెనీ యజమాని వేలాయుధన్ కు మంచి మిత్రుడు. అయితే ఆ చిత్రంలో హీరోగా శివాజీ గణేషన్ నటించగా హీరోయిన్ గా సావిత్రి తో పాటు కె.ఆర్.విజయ కూడా నటించారు. ఆ సమయంలోనే కె.ఆర్.విజయ వేలాయుధన్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రణయానికి దారితీసి ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నారు అప్పట్లోనే. ఆ విషయం కొంత కాలం రహస్యంగానే ఉన్న వారిద్దరూ ఓ సారి కొలంబోకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు విజయ అభిమాని ఒకరు ఫోటో తీసి దానిని బహిర్గతం చేయడం తో కె.ఆర్.విజయ వేలాయుధన్ వివాహం అందరికీ తెలిసిపోయింది. విజయ భర్త వేలాయుధన్ తమిళం, మలయాళం భాషల్లో 60కి పైగా సినిమాలను నిర్మించాడు. అలాగే తన భర్త సహకారంతో కె.ఆర్.విజయ ఏకంగా పది సంవత్సరాల్లో 100 సినిమాలకు పైగా నటించారు. ఇప్పటి కూడా ఆవిడ తల్లి, భామ పాత్రలో తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

1954 సంవత్సరం నుండి సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి యజమానిగా, అలాగే అశోక బ్రదర్స్ పేరిట ఉన్న కొన్ని ఓడలు, బెంగుళూరు నగరాల్లో స్టార్ హోటల్లో అధిపతిగా ఉన్న వేలాయుధన్ కోట్లకు అధిపతి కావడంతో విజయ తల్లిదండ్రులు ఆ వివాహానికి ఎటువంటి అడ్డుచెప్పలేదు. కాకపోతే అప్పటికే వేలాయుధన్ కు శారద, విలసిని అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. విజయ వేలాయుధన్ కు మూడో భార్య. అయితే అప్పట్లోనే వేలాయుధన్ సొంత విమానం ఉండేదంటే ఆయన ఎంత కోటీశ్వరుడు మనం గ్రహించవచ్చు. ఆ విమానాన్ని వేలాయుధం తన భార్య విజయకు వివాహ బహుమతిగా ఇచ్చాడని ఆమె అభిమానులు చెప్పుకునేవారు. కె ఆర్ విజయ కు వేలాయుధం కు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు హేమలత. నిజానికి వివాహం తర్వాత కె.ఆర్.విజయ సినిమాల్లో స్వస్తి చెబుదామనుకున్నా… దానికి భర్త వాదించి ఆమెను సినిమాల్లో నటించేందుకు తగు ప్రోత్సాహం ఇచ్చాడు. దానికి కారణం ఆయన సినీ నిర్మాత కాబట్టి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago