Featured

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా.. పాపం వాళ్ల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..!

RRR Postpone: ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు.. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జనవరి 7న దాదాపు విడుదల అవుతుందనే అనుకున్నారు. కాని అనూహ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా.. పాపం వాళ్ల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..!

కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. మంచి టైమ్‌లో ఇండియన్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా తెలియజేసింది. ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని.. ఇటువంటి సందర్భంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదనేది మేకర్స్ భావించారు. మళ్లీ పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటనలో తెలిపారు.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా.. పాపం వాళ్ల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..!

ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే.. ఆ సినిమా థియేటర్ దగ్గర ఉండే.. చిన్న చిన్న కిరాణా దుకాణాలతో పాటు.. రవాణా రంగానికి కూడా ఉపయోగం ఉంటుంది. సినిమా చూడటానికి ఎక్కడి నుంచో ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్ దగ్గరకు వస్తారు. ఇలా వారికి పరోక్షంగా ఉపాధికి అవకాశం ఏర్పడుతుంది. అయితే.. అన్నింటికంటే ముఖ్యంగా థియేటర్ దగ్గర తమ అభిమాన హీరోకు సంబంధించి కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. దానికి ఫ్లెక్స్ లల్లో తమ ఫొటోలను ముద్రించి.. సినిమా థియేటర్ దగ్గర తమ అభిమానాన్ని చాటుకుంటారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ఇక వారం రోజులు మాత్రమే ఉండగా.. కొన్ని థియేటర్ల దగ్గర ఇప్పటికే ఫ్లెక్స్ లు వెలిశాయి. మరికొన్ని ఆర్డర్ ఇచ్చి.. మరీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా ఆర్డర్ ఇచ్చిన వాటిని మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడంతో అటు ఫ్యాన్స్.. వాటిని తయారు చేసేవాళ్లు నష్టపోతున్నారు.

ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు..

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించి కటౌట్లు, ఫ్లెక్సీలు ఆర్డర్ అంతా ఓకె అయిన తర్వాత సడన్ గా సినిమా వాయిదా అనగానే.. వాటిని తయారు చేయడానికి పడిన కష్టం, ఖర్చు మొత్తం నీటిలో పోసిన పన్నీరుగా మారిపోయింది. దీనికి సంబంధించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. అందులో ఎక్కడివి అక్కడే కటౌట్లు, ఫ్లెక్సీలు పడి ఉన్నాయి. వాళ్లు ఇంకా వాయిదా పడిన విషయం తెలుసో.. తెలియదో కానీ.. ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ వాయిదా అనేది అందరికీ నష్టాలను తెచ్చిందనే చెప్పాలి. మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు.. మీరు ఎప్పుడు వచ్చిన కలెక్షన్స్ మాస్ వస్తాయ్.. కానీ మాకు మీ మీద నమ్మకం పోయింది అంటూ నెటిజన్స్ ఆవేదనతో కామెంట్లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

14 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

14 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

14 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

15 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

15 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

16 hours ago