ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న జక్కన్న దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. మరో ఐదు బాషల్లో డబ్ అయి మొత్తం 10 భాషల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీం సభ్యలు తేదీని ప్రకటించారు. అదే డిసెంబర్ 19న హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు. అయితే ఇప్పటికే మన తెలుగు హీరోలు ముంబయ్ లో వాలిపోయారు.
వాళ్లు అక్కడ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తాడనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో పాటు.. పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.
అయితే.. దీని గురించి అధికారికంగా ధృవీకరణ ఇంకా కాలేదు. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఉంటదనే దానిపై ఎలాంటి అధికారింగా ప్రకటన రాలేదు. మరోవైపు.. SS రాజమౌళి త్వరలో రాబోయే హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు సంబంధించి నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో రాజమౌళి, నాగార్జున పాల్గొని తమ ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, నాగార్జునతో పాటు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్ , దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరు అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…