ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేసేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రమోషన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీలో కూడా విడుదల కానుంది. ఈ నెల 19న ముంబైలో హిందీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని RRR మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు.
ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు.
సల్మాన్ ఖాన్‌తో పాటు, పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. దీని గురించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలైందని చెప్పాడు. ఈ షాకింగ్ కామెంట్స్ రాజమౌళి ఎక్కడ చెప్పాడో తెలుసా.. బిగ్ బాస్ ఫైనల్ వేదికపైన. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
దీనిలో ఈ వేదికపై చాలామంది నటులు తన డ్యాన్స్ లతో ఇరగదీశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా హాజరయ్యారు. అతడు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. మీరు ఈ 100 రోజులు చాలా మిస్ అయ్యారు అనగా ట్రిపుల్ ఆర్ కూడా మిస్ అయ్యాము సార్ అంటూ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నారు. ట్రిపుల్ ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది అంటూ సరదా కామెంట్ చేశారు. దాంతో హౌస్ మెంట్స్ నిజమే అనుకుని షాక్ అయ్యారు. ఇటు నాగార్జున కూడా షాక్ అయ్యి రాజమౌళి వైపు చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…