RRR Team: గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు నేటితో రానే వచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో సందడి చేశారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా చూడటానికి పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు ఇకపోతే నిన్న రాత్రి అభిమానులతో కలిసి ఆర్ఆర్ఆర్ టీం నిన్న రాత్రి ఈ సినిమాను చూశారు.
ఇక ఈ సినిమాని చూడటం కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ బస్సు ఏర్పాటు చేశారు.ప్రీమియర్ షో మొదలైనప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’టీం మొత్తం బస్సుల్లోనే థియేటర్లకు వెళ్లింది. దర్శకుడు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, హీరో రామ్ చరణ్ మిగతా చిత్ర బృందం సభ్యులు ఈ ప్రత్యేక బస్సు ద్వారా థియేటర్ కు చేరుకొని ఈ సినిమాని చూశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ షోతోనే మంచి టాక్ సంపాదించుకుంది. ఇలా మొదటి షోతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఇక అనంతపురం జిల్లాలో ఈ సినిమాను చూస్తూ ఓ అభిమాని గుండెపోటు తో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…