Sai chandh Father : నా కొడుకు కాలేయం పాడై పాయింది… పెద్ద కొడుకు గురించి ఎమోషనల్ అయిన…: సాయి చంద్ తండ్రి

Sai Chandh Father : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలను చైతన్యపరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన కుటుంబానికి తీరని లోటు.

నా కొడుకు కోసం కష్టపడినా ఫలితం లేదు…

సాయి చంద్ గారి తండ్రి కూడా అభ్యుదయ భావాలను కలిగి సమాజం కోసం పోరాడే మనిషి. ఆయన లాగే ఆయన కొడుకులు కూడా పెరిగారు. ఒకవైపు సాయి చంద్ తన గాత్రంతో తెలంగాణ సమాజాన్ని ఉద్యమ దిశగా మేలుకొల్పితే మరోవైపు పెద్ద కొడుకును మిలిటరీకి పంపి దేశం కోసం గన్ పట్టించారు. ఏనాడూ పిల్లల నుండి ఏదీ ఆశించని ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు దూరమై శోకాన్ని మిగిల్చారు. పెద్ద కొడుకు మిలిటరీలో రిటైర్ మెంట్ తీసుకుని అనారోగ్యం కారణంగా వచ్చేసారు.

ఆయనకు కాలేయం పూర్తిగా పాడైపోయిందని డాక్టర్స్ చెప్పడంతో నెలలు నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగారు. పసిపిల్లాడికి చేసినట్లు తండ్రి ఆ కొడుకుకు అన్నిసపర్యలు చేసారు. కాలేయం ఇవ్వడానికి కూడా సిద్ధమైన ఆ తండ్రి కి చివరకు కొడుకు దూరం అయ్యాడు. ఇక ఆ కొడుకు పోయాడనే దుఃఖం దిగమింగే లోపే ఇలా సాయి చంద్ కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆకస్మికంగా మరణించాడు. ఇలా ఆ తండ్రి బాధ ఎవరూ తీర్చలేనిది.