నేడు సాయిధరమ్ తేజ్ కు కీలక సర్జరీ.. వెల్లడించిన వైద్యులు..

సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ప్రతీ రోజు వందల్లో వార్తలు.. అతడి చికిత్సకు సంబంధించి ప్రతీ న్యూస్ ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడు నడిపిన బైక్ గురించి అనేక వార్తలు వచ్చాయి. వాటితో పాటే అతడు బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగిందనే ఫేక్ వార్తలు కూడా వచ్చాయి.

ఇవన్నీ పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి చికిత్సకు సంబంధించి మరో వార్త వచ్చింది. అతడికి కీలకమైన సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలామందికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనే అనుమానాలకు కూడా వైద్యులు చెక్ పెట్టారు. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడికి అబ్జర్వేషన్ లో పెట్టామని.. 24 గంటల తర్వాత కీలక సర్జరీ చేసేదుకు ప్రయత్నిస్తున్నామని.. వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

మొదట అతడు ఆసుపత్రిలో చేరగానే 48 గంటల డేంజర్ జోన్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ శారీరం సహరిస్తే సర్జరీ చేస్తామని చెప్పిన వైద్యులు.. తాజాగా ఆ గడువు ముగిసింది. దీంతో అతడి శరీరం సహకరిస్తే సర్జరీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

కాలర్‌ బోన్‌కు ఫ్రాక్చర్‌ కావడంతో దానికి సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు.