శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అతడి ప్రమాదానికి గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందని వార్తలు రాగా.. దానిని పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలను న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడంపై అటు అభిమానులు, ఇటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
గత రెండు రోజుల నుంచి మీడియా అంతా ఆ మెగా హీరో చుట్టే తిరుగుతోంది. అతడు బైక్ నడుపుతున్న సమయంలో 300 కిలోమీటర్ల వేగంతో నడిపారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. కానీ అంత స్పీడ్ గా వెళ్లే రోడ్లుగానీ.. అంత అవకాశం గానీ హైదరాబాద్ లో లేవు. కానీ ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై జబర్దస్త్ హైపర్ ఆది ట్విట్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేశారు.
అన్నా.. నిన్ను అలా చూస్తుంటే ఏడుపు వస్తుంది.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన బాధను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు హైపర్ ఆది. దీంతో పాటు మీడియాలో తప్పుడు కథనాలపై కూడా తన రేంజ్ లో విరుచుకుపడ్డాడు.. తప్పుడు ప్రసారం, ప్రచారాలు చేయడం వల్ల నిజాలను చెప్పినా.. మున్ముందు నమ్మే స్థితిలో ఉండరని అన్నారు.
హైదరాబాద్ రోడ్లపై సూపర్ మాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడ్‌తో వెళ్ళలేడు.. మీరు ఎక్కడ దొరికారురా మాకు.. మీ బతుకులు చెడ అంటూ ట్వీట్ చేశాడు హైపర్ ఆది. అతడు తెలుగు మీడియాపై తప్పుడు వార్తలు చెబుతున్నారంటూ.. ట్వీట్ చేయడంతో నెటిజన్లు కూడా అతడికి సపోర్టు పలికారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…