బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో శనివారం నాగార్జున అందరినీ ఒకసారి పలకరించారు. హౌస్ ఎలా ఉంది.. బాగానే ఉన్నారా అంటూ ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా అడిగారు. కంటెస్టెంట్లు కూడా వారి వారి సమాధానాలకు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఉండగా.. వాళ్లకు నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే.. హౌస్ మెట్లలో ఎవరు కట్, ఎవరు సెట్ అనేది. అంటే ఎక్కువగా కనెక్ట్ అయిన వారితో సెట్ చెప్పి.. వాళ్లకు ప్రెండ్షిప్ బ్యాండ్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
కట్ అయిన వారి ఫొటోను చింపి డస్ట్ బిన్ లో వేయాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్లలో ఎక్కువ శాతం కాజల్ తో కట్ అంటూ ఆమె ఫొటోను చింపి డస్ట్ బిన్ లో వేశారు. హౌస్ లో దాదాపు ఎడుగురు కంటెస్టెంట్లు ఆమెతోనే కట్ అంటూ చెప్పారు.
ఇలా చేస్తున్న తరుణంలో కాజల్ ని ప్రతీ ఒక్కరు టార్గెట్ చేస్తున్నట్లు అనిపించింది. ఫస్ట్ విశ్వ వచ్చి మానస్ ని సెట్ చేసుకున్నాడు. అలాగే కాజల్ ని కట్ చేశాడు. అక్కడ్నుంచీ కాజల్ ఫోటో చిరిగిపోవడం అనేది స్టార్ట్ అయ్యింది. కానీ కాజల్ ఎక్కడా తన సహనాన్ని కోల్పోలేదు.
తన ఫొటోని చింపిన శ్రీరామ్ తోనే సెట్ అంటూ చెప్పి.. ఉమాతో కట్ చెప్పింది. ఇదిలా ఉండగా.. మధ్య మధ్యలో నాగార్జున ఎలిమినేషన్ లో ఉన్న ఇద్దరిని.. అంటే యాంకర్ రవి, హమిదా ను సేవ్ చేశారు. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో తెలియనున్నది. అయితే అందులో సరయు బయటకు వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…