సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ప్రతీ రోజు వందల్లో వార్తలు.. అతడి చికిత్సకు సంబంధించి ప్రతీ న్యూస్ ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడు నడిపిన బైక్ గురించి అనేక వార్తలు వచ్చాయి. వాటితో పాటే అతడు బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగిందనే ఫేక్ వార్తలు కూడా వచ్చాయి.
ఇవన్నీ పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి చికిత్సకు సంబంధించి మరో వార్త వచ్చింది. అతడికి కీలకమైన సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలామందికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనే అనుమానాలకు కూడా వైద్యులు చెక్ పెట్టారు. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడికి అబ్జర్వేషన్ లో పెట్టామని.. 24 గంటల తర్వాత కీలక సర్జరీ చేసేదుకు ప్రయత్నిస్తున్నామని.. వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
మొదట అతడు ఆసుపత్రిలో చేరగానే 48 గంటల డేంజర్ జోన్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ శారీరం సహరిస్తే సర్జరీ చేస్తామని చెప్పిన వైద్యులు.. తాజాగా ఆ గడువు ముగిసింది. దీంతో అతడి శరీరం సహకరిస్తే సర్జరీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
కాలర్ బోన్‌కు ఫ్రాక్చర్ కావడంతో దానికి సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…