Sai Dharam Tej:మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇవ్వడంతో ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇలా నిహారిక సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తుంటారు. ఇలా నిహారిక మాత్రం వీటికి పెద్దగా పట్టించుకోదని చెప్పాలి.
నరేష్ కుమారుడు నవీన్ డైరెక్షన్లోసాయి ధరంతేజ్ కలర్స్ స్వాతి సత్య అనే షార్ట్ ఫిలిం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. అయితే ఈ పాటపై నిహారిక స్పందించారు.ఈ పాట గురించి సాయి తేజ అప్డేట్ ఇవ్వడంతో నిహారిక తాను ఈ పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని తెలుపుతూ కామెంట్ చేశారు.
ఈ విధంగా నిహారిక కామెంట్ చేయడంతో ఒక నేటిజన్ నిహారిక పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేశారు. ఈ ధ్యాస ఏదో మీ జీవితం పై పెట్టి ఉంటే ఇలా ఉండేది కాదు కదా అంటూ కామెంట్ చేశారు. సదరు నెటిజన్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేయడంతో స్పందించిన సాయి ధరమ్ తేజ్ తన స్టైల్ లోనే ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చారు.
ఈ కామెంట్ పై స్పందించిన సాయి ధరమ్ తేజ్ నోర్మూయ్ ఏం మాట్లాడుతున్నావ్ ముందు ఆ కామెంట్ డిలీట్ చెయ్యి అంటూ సీరియస్ అయ్యారు. ఇలా సాయి తేజ్ సీరియస్ కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ విషయంపై ఫైర్ అవుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా నిహారిక పర్సనల్ లైఫ్ ను నేటిజెన్ టార్గెట్ చేయడంతో సాయి తేజ్ స్పందించిన తీరు ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…