Sai Kiran : ‘నువ్వే కావాలి’ సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది అకాశంలో మేఘం ఉంది’ పాటతో ఒక్కసారిగా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సాయి కిరణ్. తండ్రి రామకృష్ణ గారు మంచి సింగర్ అలాగే చిన్న నాయనమ్మ అలనాటి సింగర్ సుశీలమ్మ. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సాయి కిరణ్ మొదట ఈటీవీలో ‘శివలీలలు’ సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ తో పనిచేసిన ఉదయ్ భాస్కర్ గారి సినిమా నువ్వే కావాలి లో ఆఫర్ వచ్చింది సాయి కిరణ్ గారికి, నువ్వే కావాలి సినిమా అవకాశం రావడంతో ఆ సినిమాలో సాఫ్ట్ బాయ్ క్యారెక్టర్ లో నటించారు. ఇక వెంటనే ‘ప్రేమించు’ సినిమాకు పెద్ద బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఆఫర్ తో ఆ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. అయితే ఆ తరువాత సరైన సినిమాలను ఎంచుకోక పోవడంవల్ల హీరోగా రానించలేక పోయిన సాయి కిరణ్ బుల్లి తెర వైపు అడుగులేశారు.
ఉదయ్ కిరణ్ మరణం నన్ను బాగా ప్రభావితం చేసింది…
ఒకవైపు అన్ని భాషలలోనూ సీరియల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సాయి కిరణ్ అటు సినిమాల్లోను మంచి పాత్రలు వచ్చినపుడు చేస్తున్నారు. ఇక ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పారు సాయి కిరణ్. సినిమా వజ్రోత్సవాల సమయంలో మా మధ్య ఫ్రెండ్ షిప్ మొదలయిందని, ఇక క్రికెట్ మ్యాచ్లు ఆడటం వల్ల మరింత స్నేహం పెరిగిందని తన మరణం చాలా బాధించిందని చెప్పారు సాయి కిరణ్.
తన బాధను, ఇతరుతో ఉదయ్ కిరణ్ పంచుకోడని ఎప్పుడూ ఊరికే మాట్లాడి నవ్వుతాడు కానీ తన కోపం కానీ బాధ కానీ ఏదీ చెప్పడు, అలానే చనిపోవాలనుకున్నపుడు తన బాధ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు భార్య కానీ ఇతర కుటుంబం సభ్యుల గురించి విషయాలు ఏమి తెలియవని సాయి కిరణ్ చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఉండుంటే మాత్రం తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లినా మంచి అవకాశాలు తనకు వచ్చేవి అంటూ సాయి కిరణ్ బాధపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…