Sai Kiran : ‘నువ్వే కావాలి’ సినిమాలో ‘అనగనగా ఆకాశం ఉంది అకాశంలో మేఘం ఉంది’ పాటతో ఒక్కసారిగా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సాయి కిరణ్. తండ్రి రామకృష్ణ గారు మంచి సింగర్ అలాగే చిన్న నాయనమ్మ అలనాటి సింగర్ సుశీలమ్మ. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న సాయి కిరణ్ మొదట ఈటీవీలో శివలీలలు సీరియల్ లో నటించారు. ఆ తరువాత నువ్వే కావాలి సినిమా అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించారు. ఇక వెంటనే ‘ప్రేమించు’ సినిమా ఆఫర్ తో ఆ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. అయితే ఆ తరువాత సరైన సినిమాలను ఎంచుకోక పోవడంవల్ల హీరోగా రానించలేక పోయిన సాయి కిరణ్ బుల్లి తెర వైపు అడుగులేశారు.
చిరు, పవన్ ఇంట్లో పాములు పట్టాను…
స్వతహాగా శివభక్తుడైన సాయి కిరణ్ కు పాములను చంపడం నచ్చేది కాకపోవడంతో వాటిని పట్టుకోడానికి ట్రైనింగ్ తీసుకుని పాములను రక్షించే టీంలో చేరారు. అలా ఇప్పటిదాకా దాదాపు 3000 పాములను రక్షించి శ్రీశైలం అడవులలో వదిలారు. అయితే అలా పాములను పట్టడానికి వెళ్ళినపుడు ఒకసారి అనుకోకుండా పాము కరవడం వల్ల ఇక చనిపోతానేమో అని భయం వేసిందట, వెంటనే హాస్పిటల్ వెళ్లి అక్కడ మీడియా కి చెబుతా అంటూ కొంచెం భయపెట్టి చికిత్స తీసుకున్నాను కానీ పాములను పట్టుకోవడం మనలేదు అంటూ చెప్పారు. ఇక శ్రీశైలంలో పాములను వదలడానికి వెళ్ళినపుడు ఒక గోనసంచిలో దాదాపు పది నుండి పదిహేను పాములను ఉంచి ఆ సంచి విప్పి అడవిలో పాములను వదిలేస్తాము, అలా వదలడానికి వెళ్ళినపుడు అనుకోకుండా సంచి చిరిగి నా కాళ్ళమీద మొత్తం పాములు పడటంతో భయమేసింది. అన్ని పాములు నా కాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని త్రాచు పాములవడంతో ఒక్కటి కరిచినా చనిపోవడం ఖాయం అనుకున్నా, ఇక శివుడితో మనసులో ఒకటే అనుకున్నా ఒక్క పాము నన్ను కరిచినా ఇక జీవితంలో పాములను కాపాడనని, కదలకుండా అలానే నిలుచున్నా. ఒక్క పాము నన్ను కరవలేదు వెళ్లిపోయాయి, దూరంగా వెళ్ళిపోయాక నన్ను వెనక్కి తిరిగి చూసాయి.
పాములు దగ్గరగా ఉన్నపుడు కదలకుండా నిలబడితే చాలు అవి మనలను ఏమి చేయవు అంటూ చెప్పారు. ఇక చిరంజీవి గారి ఇంట్లో తరచూ పాములు స్విమ్మింగ్ పూల్ లో వచ్చేవి అలా రాకుండా మేము వెళ్లి సలహా ఇస్తాము అంటూ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా పాములు రావడానికి ఆస్కారం లేకపోయినా ఎలా వస్తున్నాయో తెలియక సలహా అడిగారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా పాములను పట్టాము. అలా పాములను రక్షించడం అలవాటుగా పెట్టుకున్నాను. అయితే నాన్న చనిపోయాక అమ్మ చాలా భయపడేది, నేను పాము పట్టడానికి వెళితే ఆరోజంతా నిద్రపోయేది కాదు అందుకే ఈ మధ్య పాములను పట్టడం తగ్గించాను అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…