Sai Pallavi : విరాట పర్వం సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో సాయి పల్లవి చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఎపుడూ వివాదాస్పద వాఖ్యలు చేయని సాయి పల్లవి, వివాదాల్లో ఉండని సాయి పల్లవి మొదటి సారి ఇలాంటి ఒక ఉదంతంలో ఇరుక్కుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కాశ్మీర్ పండిట్స్ చనిపోవడంను గోరక్షకుల ఉదంతంలో జరుగుతున్న హత్యను రెండూ హింసగానే చూడాలనేది సాయి పల్లవి మాటల సారాంశం.
క్షమాపణలు… కృతజ్ఞతలు…
ఇక సాయి పల్లవి చేసిన వాఖ్యలు కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. దీంతో ఆమె పై పోలీసు కేసు కూడా పెట్టారు. కాశ్మీర్ పండితులను చంపిన ఉగ్రవాదులతో, గోరక్షకులను పోల్చిందంటూ క్షమాపణలు చెప్పాల్సిందే అని కేసు పెట్టారు. ఇక ఉదంతం పై సాయి పల్లవి స్పందించింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నవారికి క్షమాపణలు చెబుతూనే మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడటం తొలిసారి అంటూ చాలా అలోచించి మాట్లాడుతున్నాని చెప్పారు.
ఇక నేను మాట్లాడిన వీడియోని పూర్తిగా చూడకుండా కొంచెం చూసి మీడియాలో ఆ క్లిప్పింగ్స్ వేశారని. నేను ఆ ఇంటర్వ్యూ లో మీరు లెఫ్ట్ లేదా రైట్ కమ్యూనిస్ట్ అనే ప్రశ్నకు లెఫ్ట్, రైట్ కాదు హింస ఏదైనా హింసే అనే ఉద్దేశ్యంతో మాట్లాడాను కానీ నా మాటలు కొంతమందికి తప్పుగా అర్థమయ్యాయి. అందుకు వారికి క్షమాపణలు, అర్థం చేసుకుని మద్దతు ఇచ్చినవారికి కృతజ్ఞతలు అంటూ చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…