Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?
Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమౌతున్న ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా ప్రస్తుతం వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఈ ఏడాది మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమాన్ని వదిలి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు. అయితే తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రోజా గురించి ఇంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుడిని ప్రార్థించడమే కాకుండా, రోజా ఈ కార్యక్రమానికి తిరిగి వస్తే తాను తప్పుకుంటానని తెలిపారు. అయితే తాను ఈ విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు. రోజా గత తొమ్మిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఒక లెగసీ క్రియేట్ చేశారు. తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి రావాలనుకున్న తాను తన స్థానాన్ని తనకు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఇంద్రజ తెలిపారు.
నేను ఈ విషయాన్ని ఏ వేదిక పైనైనా చెబుతాను ఇంద్రజ నేను జబర్దస్త్ కార్యక్రమానికి వస్తున్నాను అని రోజా తనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు నేను రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…