Connect with us

Featured

Indraja: రోజా జబర్దస్త్ తిరిగి జబర్దాస్ట్ కి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ !

Published

on

Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమౌతున్న ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా ప్రస్తుతం వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Advertisement
Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?
Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?

జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఈ ఏడాది మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమాన్ని వదిలి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు. అయితే తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రోజా గురించి ఇంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?
Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?

తాను రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుడిని ప్రార్థించడమే కాకుండా, రోజా ఈ కార్యక్రమానికి తిరిగి వస్తే తాను తప్పుకుంటానని తెలిపారు. అయితే తాను ఈ విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు. రోజా గత తొమ్మిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఒక లెగసీ క్రియేట్ చేశారు. తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి రావాలనుకున్న తాను తన స్థానాన్ని తనకు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఇంద్రజ తెలిపారు.

రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వెళ్తా…

నేను ఈ విషయాన్ని ఏ వేదిక పైనైనా చెబుతాను ఇంద్రజ నేను జబర్దస్త్ కార్యక్రమానికి వస్తున్నాను అని రోజా తనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు నేను రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Featured

Tollywood: పవన్, రాజమౌళి కాంబోలో మూవీ.. అడ్డంగా ఇరికించేసిన జక్కన్న!

Published

on

Tollywood: టాలీవుడ్ హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవలె సినిమాలకు సంబంధించిన షూటింగ్ ని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే.. పవన్‌ కళ్యాణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది ఊహకు కూడా అందదు.

Advertisement

ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు టాలీవుడ్‌ లోనే అంత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా ఇది నిలుస్తుందని చెప్పవచ్చు. కాగా జక్కన్న ఇప్పటి వరకు ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు, ప్రభాస్‌ తో మూడు సినిమాలు, రామ్‌ చరణ్‌తో రెండు సినిమాలు, నితిన్‌, రవితేజ, నాని, సునీల్‌ లతో ఒక్కో సినిమా చేశారు. ఇప్పుడు మహేష్‌ బాబుతో మొదటిసారి సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ ఆయన ఈ మూవీని రూపొందించబోతున్నారు.

పాన్‌ ఇండియా ఆర్టిస్టులతో పాటు అంతర్జాతీయంగా పేరున్న ఆర్టిస్ట్ లను కూడా దించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన ప్రస్తావన ఉండటం విశేషం. పవన్‌ తో సినిమా చేయాలని ఫ్యాన్స్ అరుస్తుండగా, పవన్‌ కళ్యాణ్‌ ని అడగాలని రాజమౌళి చెప్పడం, జక్కన్నతో సినిమా చేయడానికి సంబంధించిన పవన్‌ కూడా రియాక్ట్ కావడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన పంజా సినిమా ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా రాజమౌళి వచ్చారు.

సమాధానం ఆయనే చెప్పాలి..

Advertisement

పంజా సినిమా టైటిల్‌ అదిరిపోయిందని, టైటిల్‌ సాంగ్‌ కూడా చించేశారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ని కలుద్దామని చాలా సార్లు అనుకున్నాను. కానీ ఎప్పుడూ కుదరలేదు. ఒకసారి కోల్‌కత్తా లో షూటింగ్‌లో ఉన్నారని వెళితే, నేను వెళ్లిన రోజే ఆయనకు షూటింగ్‌ లేదు. అలా మిస్‌ అయ్యింది. ఇన్నాళ్లకి పంజా ఈవెంట్‌లో కలిసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంద ని అన్నారు రాజమౌళి. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఫ్యాన్స్‌ పవన్‌తో సినిమా అని అరుస్తున్నారు. దీనికి రాజమౌళి రియాక్ట్ అవుతూ ఆ ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పాలి అంటూ వెళ్లిపోయారు రాజమౌళి. అలా అభిమానుల ముందు పవన్ కళ్యాణ్ ని అడ్డంగా ఇరికించేశారు జక్కన్న.

Advertisement
Continue Reading

Featured

Nagarjuna: కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున

Published

on

Nagarjuna: గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య పేరు అలాగే కొండా సురేఖ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. నాగార్జున కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొండా సురేఖ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

Advertisement

నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నాగార్జునకు తెలిపింది. దీంతో ఆయన తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జునను న్యాయ స్థానం ప్రశ్నించింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు.

ఆ ఉద్దేశంతోనే..

రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్‌ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని నాగ్ తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ను కోర్టు రికార్డు చేసింది. మరి ఈ విషయంపై కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తుందో కోర్టు ఆమె పట్ల ఏ ఏమైనా తీర్పును ఇస్తుందో చూడాలి మరి. అలాగే పరువు నష్ట దావా కింద కోటి రూపాయల వరకు నాగార్జున కోర్టులో వేసినట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి. ఇప్పటికే నాగార్జునకు ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, నాని, కుష్బూ, ఇంకా చాలామంది సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Kavya Thapar: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. అందుకోసమేనా!

Published

on

Kavya Thapar: తెలుగు ప్రేక్షకులకు ముంబై బ్యూటీ కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. తన అందంతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇక అదే ఊపుతో ఏక్ మినీ కథ, ఈగల్,ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య థాపర్. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. అయితే మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య మాట్లాడుతూ.. నేను మన కల్చర్స్ ఫాలో అవుతాను. నవరాత్రికి మన సంసృతిలో ఏం చేస్తారో అవన్నీ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను.

మొదటిసారి ఉపవాసం..

మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నాను విశ్వం సినిమాకు మంచి విజయం రావాలని, కేవలం సాత్వికాహారం లాంటిది మాత్రమే తీసుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ఇంటర్వ్యూలో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల సైతం ఆశ్చర్యపోయారు. తన సినిమా హిట్ అవ్వాలని ఉపవాసం ఉంటున్న ఈ ముద్దుగుమ్మని ప్రేక్షకులు సైతం అభినందిస్తున్నారు. కావ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తప్పకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది దుర్గమ్మ అమ్మవారికు అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆమె డెడికేషన్ కు మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం మీరు ఉపవాసం ఉంటున్నారు తప్పకుండా ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా కావ్య చేతిలో ఈ సినిమాతో పాటు మరొక మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

https://x.com/GetsCinema/status/1843534581745758533?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1843534581745758533%7Ctwgr%5E1c9c177891c8eee41113935c84aa627ee25eae15%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fkavya-thapar-interesting-comments-on-her-viswam-movie-regarding-navaratri-873338.html

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!