Categories: FeaturedMovie News

K. Balachandar : కమల్ హాసన్ ను చూసి నేర్చుకో అంటూ రజనీ కాంత్ ను తిట్టిన దర్శకులు బాలచందర్..!

K. Balachandar : తమిళ లెజెండరీ దర్శకులు కే. బాలచందర్ ఎంతో మంది సూపర్ స్టార్స్ కి లైఫ్ ఇచ్చారు. తమిళ ఇండస్ట్రీ కి రెండు కళ్లుగా చెప్పుకునే రజనీకాంత్, కమల్ హాసన్, ఇక మన మెగాస్టార్ చిరు, జయసుధ, జయప్రద, శ్రీదేవి, నాజర్, ప్రకాష్ రాజ్, వంటి ఎందరికో ఆయన తన సినిమాల ద్వారా లైఫ్ ఇచ్చారు. మహిళలకు తన సినిమాలలో ప్రాధాన్యతనిస్తూ విమెన్ సెంట్రిక్ సినిమాలను తీసే బాలచందర్ గారు ఆయన సినిమాల్లో విమెన్ క్యారెక్టర్ ను చాలా బోల్డ్ గా చూపిస్తారు. ఇక బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడితో దాదాపు 15 సినిమాలను ఇప్పటి సూపర్ స్టార్స్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్ తీశారు.

రజనీ కాంత్ ను తిట్టిన వేళ…

అపూర్వ రాగంగల్ సినిమాలో రజనీ కాంత్, కమల్ హాసన్ కే బాలచందర్ దర్శకత్వములో కలిసి నటించారు. ఈ సినిమా తరువాత మరోసారి 1976 లో ముండ్రు ముడిచ్చు సినిమా షూటింగ్ లో ఒక సంఘటన జరిగింది. కే బాలచందర్ గారు సినిమా షూటింగ్ లో బ్రేక్ ఇచ్చి బయటికి వెళ్లారు. ఇక కమల్ హాసన్ తన నెక్స్ట్ సన్నివేశానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే రజనీ మాత్రం సిగరెట్ తాగటానికి బయట వచ్చారు. ఇక అదే సమయంలో వచ్చిన బాలచందర్ ఇద్దరిని చూసి రజనీకాంత్ ను పిలిచి క్లాస్ ఇచ్చారట. కమల్ ని చూసి నేర్చుకో వాడు ఏరోజుకైనా గొప్ప స్టార్ అవుతాడు, నువ్వు ఏమవుదామని అనుకుంటున్నావ్ జీవితంలో పైకిరావాలనుకుంటున్నావా లేదా అంటూ క్లాస్ ఇచ్చారట.

సినిమా కెరీర్ లో రజనీ కంటే ముందు కమల్ హాసన్ పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఎవరు ఊహించని విధంగా రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. ఇక ఇలా ఇద్దరూ గొప్ప హీరోలయ్యాక ఒక వేడుకలో ఇద్దరూ పాల్గొనగా ఆ వేడుకకు బాలచందర్ గారు అతిధిగా హాజరయ్యారు. అపుడు వేదిక పై ఉన్న రజనీకాంత్ కిందకు వచ్చి ఆయన కాళ్ళకు దండం పెట్టారట. ఇక కమల్ హాసన్ వేదిక పై ఉండటంతో ఆ తరువాత కాసేపటికి వచ్చి బాలచందర్ ను హత్తుకున్నారట. ఇక బాలచందర్ ఆ సందర్బంలో మాట్లాడుతూ కమల్ హాసన్ కళను గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు.. రజనీ అయితే సాటి వారందరిని గౌరవిస్తాడు అందుకే ఒకరు గొప్పగా నటుడు, మరొకరు గొప్ప స్టార్ అయ్యారు అంటూ ఇద్దరినీ ప్రశంసించారు. ఎవరి రాత ఎలా ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదంటూ మరో సందర్బంలో అనడం కొసమెరుపు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago