Sai Priya : వివాహ బంధం నేడు ఎంత అపహాస్యం అవుతుందో ఇలాంటి ఘటనలు చూసినపుడు అనిపిస్తుంది. విశాఖపట్నం లో సంచలనం రేపిన సాయి ప్రియ మిస్సింగ్ కేసు జులై నెలలో బాగా వైరల్ అయింది. ప్రేమించినవాడితో లేచి పోయిన సాయి ప్రియ చివరకు ఆచూకీ లభించింది. తన భార్య ఏమైందో అని వెతికి ఆందోళన చెందిన భర్తను బాగానే మోసం చేసింది సాయి ప్రియ. ఇలాంటి ఘటనలు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇక సాయి ప్రియ ను వెతకడానికి పోలీసులకు కోస్టల్ గార్డ్ సిబ్బందికి కలిపి అయిన ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు. ఇంతటి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి, ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టి వెళ్లి పోయిన సాయి ప్రియ బాధ్యతా రాహిత్యాన్ని అందరూ ప్రశ్నించారు.
బాధ్యతా రాహిత్యం పై పోలీసుల కన్నెర్ర…
నెల క్రితం వైజాగ్ లో సంచలనం రేపింది వివాహిత సాయిప్రియ మిస్సింగ్ ఉందంతం. పెళ్లి రోజు కావడంతో భార్యకు బంగారు గాజులు బహుమతిగా తీసుకుని సాయి ప్రియ భర్త రవి బీచ్ కి తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేస్తే, భర్త రవిని సాయి ప్రియ ప్రియుడితో లేచి పోయి మరింత సర్ ప్రైజ్ చేసింది. ఇక బీచ్ లో అలల తాకిడికి కొట్టుకుపోయిందేమో అన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి ఆ తరువాత పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బది సహాయంతో హెలీకాప్టర్లు, గజ ఈతగాళ్ళను వాడి సముద్రం లో గాలించినా ఫలితం కనిపించలేదు. ఇక ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని సీసీ టీవీ అన్ని చెక్ చేసి పోలీసులు వెతికినా ఫలితం శూన్యం.
ఇక రెండురోజులయ్యాక తాను క్షేమంగా ఉన్నానని తన ప్రియుడితో కలిసుండాలి అనుకుంటున్నట్లు చెప్పి పెళ్లి చేసుకున్నామని అందుకే లేచిపోయానని వివరించింది సాయి ప్రియ. ఇక చేసేదేమి లేక భర్త అంగీకరించి వారిపై ఎలాంటి కేసు పెట్టలేదు. అయితే ఇపుడు సరిగ్గా నెల తరువాత సాయి ప్రియ కేసులో కొత్త ట్విస్టులు మొదలయ్యాయి. పోలీసులు ఈ కేసు లో కన్నెర్ర చేసారు. వారి సమయాన్ని, అలాగే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడంతో ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన సాయి ప్రియ ఆమె ప్రియుడు రవితేజ మీద కేసు పెట్టారు. ఆమెను వెతకడానికి కోటి రూపాయల ఖర్చు అవ్వడం వల్ల సమాజంలో ఇటువంటి పనులు తప్పు సంకేతాలు పంపుతాయని కోర్టు వారి అనుమతి తో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…