Movie News

Saiyami Kher: బాడీ షేప్ గురించి చీప్ కామెంట్ చేశారు… బాడీ షేమింగ్ విషయాలను బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి?

Saiyami Kher: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల జీవితం చాలా లగ్జరీగా ఉంటుందని భావిస్తాము. అయితే వాళ్లు అనుభవించే ఆ లగ్జరీ జీవితం వెనక ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఉంటాయని విషయం వాళ్ళు చెబితే తప్ప మనకు తెలియదు. ఎంతోమంది కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇలా జరిగినటువంటి చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు మరాఠీ ముద్దుగుమ్మ సయామీ ఖేర్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఈ సినిమా అనంతరం తిరిగి మరాఠి హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా నాగార్జున నటించిన ది వైల్డ్ డాగ్, ఆనంద్ దేవరకొండ హైవే సినిమాల ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన ‘ఫాదూ’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో తాను తన బాడీ షేప్ గురించి ఎదుర్కొన్నటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరియర్ మొదట్లో తనని చాలామంది లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలంటూ వెటకారంగా మాట్లాడారని ఈమె బాధపడ్డారు.

Saiyami Kher: నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి…

ఇలా ఒక వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చాలామంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి వారి పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఈమె ఆవేదన చెందారు.ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నోటికొచ్చినట్లు చీప్ కామెంట్స్ చేయకూడదు అంటూ ఈ సందర్భంగా సయామీ కేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

6 minutes ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

34 minutes ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

6 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

6 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

6 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

6 hours ago