Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఐఫా సినివేడుకలో తన గత సినిమా కెరీర్ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్ గా నిలిచిన మైనే ప్యార్ కియా సినిమా చాలా పెద్ద హిట్. ఆ సినిమా తరువాత సల్మాన్ ఖాన్ కి సినిమా అవకాశాలు భారీగా వచ్చుంటాయి అని అనుకుంటాం. కానీ అది నిజం కాదట. సినిమా ఘన విజయం సాధించినా ఆ క్రెడిట్ అంతా హీరోయిన్ భాగ్యశ్రీ ఖాతాలోకి వెళ్లిందట.
కన్నీళ్లు పెట్టుకున్న కండల వీరుడు….
మైనే ప్యార్ కియా సినిమా సల్మాన్ ఖాన్ కి, భాగ్యశ్రీ కి మొదటి సినిమా. ప్రేమకథ చిత్రాలలో మంచి హిట్ సాధించింది. అప్పట్లో భాషతో సంబంధం లేకుండా ఒక హిందీ సినిమా దక్షిణాది భాషలలో కూడా సూపర్ హిట్ అయింది. అటువంటి సినిమా తరువాత సల్మాన్ కెరీర్ గ్రాఫ్ బాగా పీక్స్ కి వెళుతుందని అందరు భావిస్తారు. కానీ సినిమా క్రెడిట్ అంత హీరోయిన్ భాగ్యశ్రీ ఖాతాలోకి వెళ్లిందట, సల్మాన్ చేతిలో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదట, ఆరు నెలలు ఖాళీగా ఉన్నాడట. అయితే తన తండ్రి జీపీ సిప్పి కి 2000 రూపాయలు డబ్బులిచ్చి తనతో సల్మాన్ సినిమా చేస్తున్నట్లు ప్రకటన ఇప్పించారట.
తన జీవితాన్ని నిలబెట్టింది రమేష్ థౌరాణి….
సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో రమేష్ థౌరాణి తన జీవితాన్ని నిలబెట్టాడని పత్తర్ కే పూల్ సినిమా అవకాశం వచ్చిందని, మ్యూజిక్ రైట్స్ కోసం 5 లక్షలు సిప్పి ఆఫీస్ లో చెల్లించి రమేష్ సినిమాను ఓకే చేసారని చెప్పారు సల్మాన్. సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో తాను కొనాలనుకున్నా డబ్బులేక ఒక షర్ట్, వాలెట్ వైపు చూస్తుంటే అది చూసి సునీల్ శెట్టి వాటిని తనకోసం కొన్నారని చెప్పి భావొద్వేగానికి గురయ్యాడు. వరుస సినిమాల పరాజయాలతో ఉన్న సమయంలో వాంటెడ్ సినిమాతో బోని కపూర్ నా జీవితాన్ని నిలబెట్టారని గుర్తుచేసుకున్నాడు. ఇక ఈ విషయం చెప్పేటప్పుడు బోని కపూర్ ను కౌగిలించుకున్నారు. స్టేజి మీదే కన్నీరు పెట్టుకున్నారు సల్మాన్ ఖాన్ ఇపుడు ఈ వీడియో బాగా వైరల్ అయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…