Salman Khan -Pooja Hedge: సినిమా సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంటుంది.ఓకే జంట రెండు మూడు సినిమాలలో కలిసి నటించిన లేదా కాస్త సన్నిహితంగా మెలిగిన వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొస్తాయి. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు అఫైర్స్ ఉన్నాయంటూ ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉంటాయి.తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా ప్రముఖ క్రిటిక్ కె ఆర్ కె సైతం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ విషయాన్ని అందరికీ తెలియ చేయబోతున్నారు అంటూ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా సల్మాన్ స్నేహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఈ విధమైనటువంటి బాధ్యత రహితమైన వార్తలను వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ కు కూతురితో సమానం.
ఈ విధంగా వారిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తే ఇలాంటి వార్తలను సృష్టిస్తారా? కొందరు మూర్ఖులు ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం వల్ల వాళ్లకు పబ్లిసిటీ వస్తుందని భావిస్తారు. అయితే ఈ విషయం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని సల్మాన్ స్నేహితుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే డేటింగ్ రూమర్లపై ఘాటుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సల్మాన్ స్నేహితుడు స్పందించడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పడినట్లు అయింది.
తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…
అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…
పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…
తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…
యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…