Featured

Samantha : ఎన్టీఆర్ కి నో చెప్పిన సమంత… ఇది మరీ టూ మచ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Samantha : ఏ హీరోయిన్ కి ఐనా పెళ్లి తరువాత కెరీర్ లో జోరు తగ్గుతుంది. దక్షిణాది హీరోయిన్స్ విషయంలో అది ఇంకా ఉంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మార్పు వస్తున్నా ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ ను గ్లామర్ పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అయితే బాలీవుడ్ లో ఇవేవి పట్టించుకోరు, అక్కడ హీరోయిన్లు పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా హీరోయిన్లుగా అది కూడా గ్లామర్ పాత్రల్లో రానిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన సమంత మాత్రం డిఫరెంట్ గా ఉంది. పెళ్లి అయ్యాక కథ పరంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసిన సమంత వైవాహిక జీవితంలో ఇమడ లేక భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకుంది. ఇద్దరూ విడిపోవడానికి కారణాలను వివరించకపోయినా విడాకుల తరువాత ఇద్దరూ సినిమాల్లో మళ్ళీ బిజీ అయ్యారు.

ఎన్టీఆర్ కి నో చెప్పిన సమంత…

ఇక విడాకుల తరువాత సమంత కెరీర్ ఇక నెమ్మదిస్తుంది అని అందరూ అనుకున్నా అమ్మడు మాత్రం రెట్టింపు జోరు తో ముందుకు వెళ్తోంది. ఇటు సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇక ఏకంగా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక వైపు పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర తో బిజీగా ఉన్న సామ్ అటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలకు కమిట్ అయింది.

ఇదే తరుణంలో ఎన్టీఆర్ కొరటాల క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అవకాశం వస్తే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పిందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ నెటిజన్స్ కూడా సమంత ఇది మరీ టూ మచ్, ఎన్టీఆర్ సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరీ అంత బిజీ గా ఉన్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తోంది. ఇంతకుముందు ఎన్టీఆర్, సమంత కలిసి కొరటాల కాంబినేషన్ లోనే జనతాగారేజ్ సినిమాలో నటించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago