Featured

Samantha : విజయ్ తో సినిమాకి సమంత కళ్ళు చెదిరే పారితోషకం….!

Samantha : నిత్యం ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలిచే హీరోయిన్ సమంత. దక్షిణాదిన అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న సమంత అందరు అగ్రహీరోలతోను నటించింది. ఇక ఇపుడు కుర్రహీరోలతోను నటించడానికి సిద్ధం అంటోంది. ఈ మధ్యనే కన్మని రాంబో ఖాతిజ సినిమాతో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన సమంత ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన సమంత తాజాగా విజయ్ దేవరకొండతో సినిమా చేయనుంది.

రెమ్యూనరేషన్ పెంచిన సమంత…..

ఇక ఖుషిగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాశ్మీర్ యువకుడిగా, సమంత తమిళ అమ్మాయిగా కనిపించనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమాకు మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లోనే జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమా కోసం సమంత పారితోషకం ఇపుడు హాట్ టాపిక్ అయింది.

సమంత ఈ సినిమా కోసం 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. సాధారణంగా సమంత ఒక సినిమాకు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే పాన్ ఇండియా సినిమా అవ్వడం ఇక తనకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉండడంతో 5 కోట్లు డిమాండ్ చేస్తోందట. ఇక సంత తన తదుపరి ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా చిత్రాలే. ఈమధ్య విడుదలైన పుష్ప సినిమా లో ఊ అంటావా మావా పాటతో ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే అన్నారని సమాచారం.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

7 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

8 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

9 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

10 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

10 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

10 hours ago