Sreemukhi: శ్రీముఖితో రెచ్చిపోయి డాన్స్ వేసిన యశ్ మాస్టర్… ఆగ్రహం వ్యక్తం చేసిన యశ్ భార్య!
Sreemukhi: సాధారణంగా ప్రతి సంవత్సరం బుల్లితెర చానల్స్ యానివర్సరీ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. ఇలా ఈ వేడుకలలో భాగంగా ఛానల్ లో ప్రసారమయ్యే టివి సెలబ్రిటీలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఆటపాటలతో అభిమానులను సందడి చేస్తారు. ఈ క్రమంలోనే జీతెలుగు 17వ యానివర్సరీ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఆటపాటలతో అందరిని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తన మాట తీరుతో అందరిని మెప్పించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు.
వేదికపై డాన్స్ మాస్టర్ యశ్ తో కలిసి శ్రీముఖి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు. ఇలా శ్రీముఖి యశ్ మాస్టర్ వేదికపై డాన్స్ చేయడంతో అది చూసిన యశ్ భార్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతలోనే మరొక టీవీ నటుడు కల్పించుకొని చెల్లమ్మ మీ ఆయన నిప్పు అంటూ యశ్ భార్యను కూల్ చేశారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఎఫ్3 చిత్ర బృందం ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు. బుల్లితెర నటీనటులందరూ ఒకే చోట ఇలా సందడి చేస్తుంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ
ప్రోమో పై లుక్ వేయండి.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…