Silk Smithas Death Mystery: 1970 -80 లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అందరిని ఎంతో సందడి చేసిన నటి అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగా కంటే ఎన్నో ఐటమ్ సాంగ్స్ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. అప్పట్లో ఒక్కో పాటకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకొని తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లకు రప్పించేది.
ఈ విధంగా ఎన్నో ఐటమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన అనురాధ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీని ఏలారు. ఇకపోతే అనురాధకు పోటీగా ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేస్తూ సిల్క్ స్మిత, డిస్కో శాంతి గట్టి పోటీ ఇచ్చే వారు.
తాజాగా అనురాధ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని నటి సిల్క్ స్మిత డెత్ మిస్టరీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిల్క్ స్మిత నాకు అంత క్లోస్ కాదు కానీ మంచి స్నేహితురాలు. ఆమె ఎప్పుడూ కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు చాలా రిసర్వ్ డ్ గా ఉండేది.అయితే తనని చూస్తే చాలా పొగరు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కాని తను చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండేదని అనురాధ తెలియజేశారు.
సిల్క్ స్మిత ఎప్పుడు తనతో మాట్లాడిన తాను అదికొన్నా,ఇది కొన్నా అని చెబుతూ ఉండేది కానీ తనకు ఎప్పుడూ ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఇలా బాధలు పడుతున్న అనే విషయాలు ప్రస్తావించలేదు. ఈ విధంగా తన వ్యక్తిగత విషయాలు మాకు చెప్పలేదు కనుక మేము కూడా ఎక్కువగా తనని అడిగే వాళ్ళం కాదు. ఇకపోతే తను చనిపోయే రోజు రాత్రి ముందు నాకు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు అని అడిగారు.మా ఆయన బెంగళూరు నుంచి వస్తున్నాడని ఎదురు చూస్తున్నాను అని చెప్పాను.
ఇప్పుడు ఒకసారి మా ఇంటికి రాగలవా అని నన్ను ప్రశ్నించింది. ఇప్పుడా? రేపు ఉదయం పాపను స్కూల్ దగ్గర దింపి రానా అని అడిగితే సరే అని ఫోన్ పెట్టేసారు. ఉదయం లేవగానే టీవీలో సిల్క్ స్మిత మరణ వార్తను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాను.ఒక వేళ ఆ రోజు రాత్రి నేను కనుక వెళ్లి ఉంటే తన బాధ నాతో చెప్పుకొని తాను ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదేమో అని ఈ సందర్భంగా సిల్క్ స్మిత మృతి గురించి చెప్పారు. అయితే సిల్క్ స్మిత ఎందుకు చనిపోయిందనే విషయం తనకు తెలియదని ఈ సందర్భంగా అనురాధ సిల్క్ స్మిత మరణం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…