Samantha tattoo : సమంత సినిమాల్లోకి వచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయన్నందుకుని ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారింది.ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య తో వివాహం ఆ తరువాత విడాకులు అయిన తన కెరీర్ లో దూసుకుపోతోంది సమంత. ఇక విడాకుల తర్వాత కూడా చైతు జ్ఞాపకాలు ఇంకా వదిలినట్టులేవు సమంతను.
ఇటీవలే ఒక సోషల్. మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఒక నెటిజెన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలనుకుంటున్న టాటూ ఏంటని అడుగగా తానసలు టాటూలే వేయించుకోకూడదనుకున్నానని బదులిచ్చింది. అలాంటి ఆలోచన ఉంటే తక్షణమే మానుకోమని అభిమానులకు సూచించింది. ఇక క్షణం పాటు అలోచించి ఈ సమాధానం చెప్పడంతో సమంత తాను గతంలో మూడు టాటూలు వేయించుకున్న దృష్ట్యా చెప్పుంటుదని అభిమానులు భావిస్తున్నారు. సమంత గతంలో ఏం మాయ చేసావే సినిమా గుర్తుగా వైఎంసీ అను ఆంగ్ల అక్షరాలను వీపు మీద వేయించుకుంది.ఇక చై అని నడుము పై చైతన్య పేరును వేయించుకుంది. ఇక చేతికి రెండు బాణాపు గుర్తులను చైతన్య, సామ్ ఇద్దరు వేయించుకున్నారు. ఇక వీరు వీడిపోయిన తరువాత వారి జ్ఞాపకంగా ఉన్న టాటూ లా వల్ల తనలా స్పందించిందని అనుకుంటున్నారు.
ఇక తాను థియేటర్లో మొదట చూసిన సినిమా ఏదని అడుగగా జూరాసిక్ పార్క్ అని చెప్పింది. ఇక మరో నెటిజెన్ అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని అడగ్గా.. మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అని సెలవిచ్చింది. ఒక హోటల్ లో హోస్టేస్ గా పని చేసినందుకు 500 రూపాయలు 8గంటల పనికోసం ఇచ్చారని చెప్పింది సామ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…