Samantha buys flat in Mumbai : సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్ ఇక పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత. విడాకుల తర్వాత కుంగిపోకుండా వరుస సినిమాలతో జోరు పెంచి అందరికి షాకిచ్చింది. అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. వరుస ప్రాజెక్టులతో మిగిలిన కుర్ర హీరోయిన్లకు గట్టిపోటి ఇస్తోంది . పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోధర షూటింగ్ లో పాల్గొంటూనే విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించనుంది . ఇక వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో అమెరికన్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ లో నటించనుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్.ఇలా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో దుమ్ములేపుతోంది సామ్.
అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉండే సమంత మోటివేషనల్ కొటేషన్స్, తన పర్యటన కు సంబందించిన ఫొటోలు, పెంపుడు జంతువులకు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్‌లతో నిత్యం అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఇటీవల ఓ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేసింది. ‘నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్‌ను నామినేట్ చేస్తున్నా.చూద్దాం మీరు ఎలా చేస్తారో.’ అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు ‘నేను కచ్చితంగా ఇలా చేయలేను’ అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు.
సముద్రం కనిపించేలా ఉన్న ఇల్లు కొంటున్న సామ్…
ప్రస్తుతం సమంత వరుణ్ ధావన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అక్షయ్ కుమార్‌తో కూడా సినిమా చేయనుందట. ఇలా వరుసగా బాలీవుడ్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటోంది సమంత.ఈ క్రమంలో సమంత ముంబైలో రెండు సీ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందని వినికిడి . ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం . ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా నిర్మాణం లో ఉన్నాయి . సమంత బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలనీ భావిస్తోంది అందుకే ముంబయిలో ఇల్లు కొంటోందని భావిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మడి ప్లానింగ్స్ మాత్రం అదుర్స్ అంటున్నారు అభిమానులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…