Samantha: హీరోయిన్ సమంత సీనియర్ నిర్మాత చిట్టిబాబు మధ్యగత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కొంతకాలం క్రితం సమంత మయోసైటిసిస్ వ్యాధి వల్ల ఇబ్బందిపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వ్యాధి నుండి కొంచం కోలుకోగానే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే ఆ ప్రమోషన్స్ లో తన అనారోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
ఈ సినిమా సక్సెస్ చేయటానికి సమంత సింపతి ప్లే చేస్తూ డ్రామాలు ఆడుతోందని సీనియర్ నిర్మాత చిట్టిబాబు సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా సమంత హీరోయిన్ మెటీరియల్ కాదని కానీ శకుంతలగా ఆమెకు అవకాశం ఎలా వచ్చిందో తెలియటం లేదని చిట్టిబాబు వెల్లడించాడు. అయితే చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
చిట్టిబాబు తనపై చేసిన ఆరోపణలకు బదులు చెబుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ క్రమంలో మనుషులు చెవులలో వెంట్రుకలు ఎలా పెంచుతారు ?అని గూగుల్ లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ చిట్టి బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా సమంత ఇచ్చిన కౌంటర్ కి చిట్టిబాబు రీ కౌంటర్ ఇచ్చాడు.
ఈ క్రమంలో తాజాగా చిట్టి బాబు స్పందిస్తూ..” నా చెవులలో ఉన్న వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను చేసిన కామెంట్స్ లో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుందని ” అన్నారు. నేను మాట్లాడితే ఆమె తల ఎక్కడ పెట్టుకుంటుందని తెలిపారు. అయితే తన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కనుక తాను కూడా ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడదలచుకోలేదు అంటూ ఈ సందర్భంగా నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…