ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమా.. పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్, సమంత డ్యాన్సులతో సినిమా రిలీజ్ కు ముందే పాట మారుమోగింది. ఈ పాటపై వివాదలు చెలరేగినా.. అంతే స్థాయిలో హిట్ అయింది. ఏపీలో పురుషుల సంఘం.. పురుషుల మనోభావాలను దెబ్బతిస్తున్నాయని కేసు కూడా పెట్టింది.
అయితే ఇది ఇలా ఉంటే హీరోయిన్ గా వరసగా సినిమాలతో సత్తా చాటుతున్న సమంతను ఐటెం సాంగ్ కు ఎలా ఒప్పించారనేది మిస్టరీగా మారింది. గతంలో సమంత ఏ సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ లు చేయలేదు. పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ సమంత కారణంగానే హిట్ అయింది. అయితే ఈ ఐటెం సాంగ్ కు సమంత ఒప్పుకోవడంపై సుకుమార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముందుగా ఐటెం సాంగ్ కు మొదటగా సమంత ఒప్పకోలేదని.. ఇటు వంటి క్యారెక్టర్లు తనకు సూట్ కావని చెప్పిందట.. అయితే సమంతను నేనే కన్విన్స్ చేశానని చెప్పకొచ్చాడు సుకుమార్. ప్రస్తుతం ఐటెం సాంగుల్లో హీరోయిన్లు కూడా చేస్తున్నారని.. ఇది మీకు కొత్తగా ఉంటుందని చెప్పానని అన్నారు సుకుమార్. నటిగా కొత్త సమంతను చూస్తారని చెప్పానని.. ఆ మాట మీద నమ్మకంతోనే సమంత ఒప్పుకుందని అన్నారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…