ఇటీవల సమంత, నాగచైతన్యకు సంబంధించి విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒకొక్కరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అస్సలు ఇంత క్యూట్ గా ఉండే ఈ జంట విడిపోవడానికి గల కారణం ఏంటనేది చాలామంది విశ్లేషిస్తున్నారు.
ఇందులో సమంత కొన్ని రోజుల క్రితం నాగచైతన్యకు చెప్పకుండా గోవా టూర్ కి వెళ్లిందని.. ఫోన్ చేసినప్పుడు తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ అబద్ధం చెప్పారని.. దీంతో నాగచైతన్య తీవ్ర మనస్థాపం చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అక్కడ ఆమె తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
వాటిని చూసిన తర్వాతనే చైతు ఈ నిర్ణయానకి వచ్చినట్లు తెలిసింది. ఇదంతా ఇలా ఉండగా.. విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. ఆమె తన మనోభావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అతడు ఆమె విడాకుల అనంతరం చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. కొన్ని నిమిషాల్లోనే వాటిని డిలీట్ చేయడంతో చర్చ మరింత వేడి ఎక్కింది.
సమంతకు అన్యాయం జరిగినట్లు ఆ ఫొటోల్లో కనిపించింది. అతడు డిలీట్ చేసిన దాంట్లో విడాకులకు దారి తీయడానికి గల కారణం వెల్లడించినట్లు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమంతపై వేధింపులు, సామాజిక ఒత్తిడి కారణంగానే విడాకుల దాకా దారి తీసిందా అనే అనుమానాలకు కూడా తావిస్తోంది. సమాజంలో పేరున్న వ్యక్తులను ట్రోలింగ్ రూపంలో మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందంటూ అతడు పోస్ట్ చేశాడు. అది ఎవరినీ ఉద్దేశించి చేశాడో తెలియదు కానీ.. అతడు డిలీట్ చేసిన దాంట్లో ఏదో ఉందంటూ ఆ విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…