Samantha: సమంత చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.గత కొంతకాలంగా ఈమె మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉన్నారు.ఇలా సమంత ఒకవైపు చికిత్స తీసుకుంటూనే ఈమె నటించిన యశోద సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి చేశారు.
అదేవిధంగా పాన్ ఇండియా స్థాయిలో సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా సమంత బెడ్ పై నుంచి పూర్తి చేశారని తెలుస్తోంది.అయితే ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు.
సమంత తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సమంతను చూసిన అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమానికి సమంత తెలుపు రంగు చీర ధరించడమే కాకుండా చేతికి రుద్రాక్ష మాల కూడా ధరించడంతో అందరి దృష్టి సమంతపై పడింది.
సమంతా ఏంటి ఇలా రుద్రాక్ష మాల పట్టుకొని ఇలా పూర్తిగా మారిపోవడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎక్కువగా జాతకాలు న్యూమరాలజీలను నమ్ముతారు. సమంత కూడా అనారోగ్యం పాలవడంతో ఈమె కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారా అందుకే ఇలా మారిపోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…