Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి బింబిసారా, సార్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి వరుస విజయాలు అందుకుంటున్న సంయుక్త మీనన్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది.
ఇక ఈ సినిమాలో సంయుక్త తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఇలా హీరోయిన్ గా మాత్రమే కాకుండా తన మంచి మనసుతో సంయుక్త ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ షోలో పాల్గొన్న సంయుక్త చేసిన పనికి నెటిజన్లు ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ షోలో పాల్గొన్న సంయుక్త మీనన్ ఒక స్కూటీని గెలుచుకుంది. అయితే, ఆ స్కూటీ తనకు వద్దని ఎవరికైనా బహుమతిగా ఇస్తానని సంయుక్త తెలిపింది. ఈ క్రమంలో రెండు బస్సులు మారి కాలేజీకి వెళ్లే వారిని చేతులెత్తమని చెప్పింది. ఆ తర్వాత వారిలో సింగిల్ పేరెంటు ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఎంచుకొని వారిలో ఒకరికి తాను గెల్చుకున్న సూటీని గిఫ్ట్‌గా ఇచ్చింది. మరొక అమ్మాయికి తన సొంత డబ్బుతో కొత్త స్కూటీ కొనిస్తానని సంయుక్త మాటిచ్చింది.
సంయుక్త ఇలా చెప్పడంతో ఆ అమ్మాయిలు ఇద్దరు సంయుక్తని హత్తుకొని ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సంయుక్త మంచి మనసు గురించి గొప్పగా కొనియాడుతున్నారు. ‘బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇలా ఇద్దరు యువతులకు సంయుక్త సహాయం చేయడమే కాకుండా తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ కి కూడా ఐఫోన్ ఇస్తూ సర్ప్రైజ్ చేసింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…