Featured

Sandhya Janak : కావాలని నాపైన, సుమన్ గారి పైన అలాంటి వీడియోస్ క్రియేట్ చేశారు… పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ కూడా ఇచ్చాము : సీనియర్ ఆర్టిస్ట్ సంధ్య జనక్

Sandhya Janak : హ్యాపీడేస్ సినిమాలో తమన్నా తల్లి పాత్రలో మెరిసిన సంధ్య జనక్ పుట్టింది పిఠాపురం. తెలుగు వారే అయినా తండ్రి రైల్వే ఉద్యోగి అవ్వడం వల్ల నార్త్ లో చదువు కొనసాగించారు సంధ్య జనక్. కలకత్తా లో చదివిన సంధ్య జనక్ చిన్న వయసులోనే స్టేజి నాటకాలు రాస్తూ నటిస్తూ ఉండేవారట. ఆ ఆసక్తి సినిమాల్లోకి వచ్చేలా చేసిందంటూ చెప్తారు. ఇక అనసూయ, మర్యాదరామన్న, వేదం, శ్రీరామరాజ్యం, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, అనామిక… ఇలా విజయవంతమైన సినిమాలన్నింట్లో ఆమె కనిపించారు. అందంగా, హుందాగా హీరో, హీరోయిన్లకు తల్లిగా అనేక పాత్రల్ని పోషించిన సంధ్యా జనక్‌ ఏడేళ్ల సినిమా కెరీర్ లో యాభై కి పైగా సినిమాల్లో నటించారు.

మైలేజ్ కోసం యూట్యూబ్ లో అలాంటి ఫేక్ వీడియోలు…

సినిమాల్లో ఈ మధ్య కాలం లో కొంచెం అవకాశాలు తగ్గాయంటూ చెప్పిన సంధ్య గారు సినిమాల్లో నటించిన వారిలో కొంతమందితో మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పింది. సలోని, రష్మిక మందన చాలా క్లోజ్ అంటూ చెప్పిన సంధ్య గారు నాకు తెలియని శత్రువులు కూడా ఉండవచ్చేమో అంటూ చెప్పారు. యూట్యూబ్ లో నేను చనిపోయినట్లు కూడా వీడియోలను పెట్టారు. ఇక హీరో సుమన్ గారితో నా వీడియోలను క్రియేట చేసి పెట్టారు.

ఆ వీడియోలు మా దృష్టికి రావడంతో నా భర్త సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. హీరో సుమన్ గారు కూడా పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చి వాటిని యూట్యూబ్ నుండి తొలగించేలా చేసారు. బహుశా ఆ ఘటన వల్ల నాకు అవకాశాలు తెలుగు సినిమాల్లో తగ్గాయేమో తెలియదు. ఇక ఇతర రాష్ట్రాలనుండి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు డిమాండ్ ఉండటం వల్ల ఇక్కడే ఉన్న వాళ్లకు అవాకాశాలు తగ్గుతున్నాయి అంటూ సంధ్య అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

3 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

23 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

23 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

24 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

24 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

24 hours ago