Featured

Geethanjali – Shiva : మొదటి మూడు రోజులు ఈ సినిమాలకి జనాలు లేరు.. కట్ చేస్తే పాటలతో రేడియో పగిలిపోయింది.!!

చిత్ర విజయం అపజయం కాలాతీతం. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో ఎవరు ఊహించగలరు. అలా అక్కినేని నాగార్జున ఒకే సంవత్సరంలో డబుల్ ధమాకా అందుకున్నారు.
గీతాంజలి 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. “యంగ్ డై ఫస్ట్” అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు.

కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్, 1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. ఈ చిత్రం విడుదల నాగార్జున యొక్క మరొక అపూర్వ విజయం సాధించిన శివ చిత్రం విడుదలకు ఆరునెలల ముందు జరిగినది.

గతంలో ఆర్జీవీ క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ గా ప‌నిచేశాడు. ఈ సినిమాల స‌మ‌యంలోనే నాగార్జునతో వ‌ర్మ‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ త‌ర‌వాత “రాత్రి” (సినిమా) అనే క‌థ‌ను అల్లి నాగార్జునకు వినిపించాడు. కానీ నాగ్ అంత‌గా ఇంప్రెస్ అవ్వ‌లేదు. ఆ త‌ర‌వాత త‌ను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటనలను మరియు బాలీవుడ్ సినిమాల్లోని కాలచక్ర, అర్జున్ హాలీవుడ్ మూవీ ‌ఎంటర్ ది డ్రాగన్ లోని కొన్ని సన్నివేశాలను ఆధారం చేసుకుని ఒక క‌థ‌ను త‌యారు చేశాడు. ఆ కథ నాగార్జునకు నచ్చడంతో.. తమ సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి అయన ముందుకొచ్చారు. ఆ విధంగా 1989 అక్టోబర్ 5న “శివ” చిత్రం విడుదలయ్యింది.

ఆర్జీవీ ఈ రెండు చిత్రాల కథలలో వ్యత్యాసం, చిత్రీకరించిన విధానము తెలుగు సినిమాకు నూతనముగా ఉండటము చేత గొప్ప విజయాలుగా నిలిచాయి. అప్పటి కమర్షియల్ చిత్రాలకు గీతాంజలి, శివ చిత్రాలు భిన్నంగా ఉండడం.. గీతాంజలి సినిమాలో స్లో సీన్స్, శివ చిత్రంలో కామెడీ మైనస్ ఉండడంతో.. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు మొదటగా పెదవి విరిచారు. ఆ తర్వాత ఈ సినిమాలను ఎగబడి చూశారు. ఈ రెండు చిత్రాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించడం ఒక విశేషం. ఆ రోజుల్లో ఈ రెండు చిత్రాల్లోని పాటలు ఆకాశవాణిలో మారుమోగాయి. రేడియో ఆన్ చేస్తే ఈ సినిమాల పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదు. ఈ చిత్రాల విడుదల తరువాత ఎందరో అమ్మాయిల మనస్సు దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. ఈ చిత్రాల నుండి నాగార్జునకు కొత్తదనాన్ని అభిలషించే వ్యక్తిగా ప్రశంసలు పొందారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago