Sanjana Galrani : మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన సంజన ఆ తరువాత కన్నడ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని అలా కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ గుర్తింపు తెచ్చుకుంది. జాన్ అభ్రహం తో చేసిన లెన్స్ కార్ట్ యాడ్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన సంజన, పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు సినిమాలో సపోర్టింగ్ రోల్ ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజన ఆ తరువాత కన్నడ లో కూడా మంచి విజయాలను చూసి దండుపాళ్యం లాంటి కన్నడ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. అయితే అనూహ్యంగా డ్రగ్స్ కేసు వల్ల ఇబ్బందులుపడిన సంజన ఆ విషయాల గురించి తాజాగా ఇంటర్వ్యూ లో తన అనుభవాలను పంచుకున్నారు.
కావాలని నన్ను ఇరికించారు….
కన్నడ లో మంచి కెరీర్ తో వెళ్తోన్న సంజన సడన్ గా డ్రగ్ రాకెట్ కేసు లో అరెస్టు అయింది. తన కంటే ముందు ఆ కేసు లో రాగిణి ద్వివేది అరెస్టు అయ్యారు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి. ఇక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ కర్ణాటక పోలీస్ వాళ్లు సంజన ను కస్టడి కి తీసుకుని ఆమెను విచారించారు. సంజన కు అంత త్వరగా బెయిల్ మంజూరు కాలేదు మూడు నెలల జైలు జీవితం తరువాత సంజన బెయిల్ మీద బయటికి వచ్చారు.
ఇక ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ చుట్టూ ఉన్న బాగా తెలిసిన సన్నిహితులే నన్ను ఇరికించారు. కెరీర్ లో బాగా ఉన్నాను స్ట్రైట్ ఫార్వర్డ్ కావడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ తెలిపారు. అక్కడ జరిగింది ఒకటైతే ఇక మీడియా ఏవేవో కథనాలు అల్లేశారు రేటింగ్స్ కోసం అంటూ తెలిపిన సంజన తన పెళ్లిని మతం ను కూడా వదల్లేదు అంటూ మాట్లాడారు. ఇక ప్రస్తుతం కొన్ని ఆఫర్స్ వస్తున్న తన పాప తో చాలా బిజీగా ఉన్నట్లు తనకు టైం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…