దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ నెల 22వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామరాజు ఫర్ భీమ్ టీజర్ విడుదల కాగా ఆ టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపించడంపై వివాదం తలెత్తింది. రాజమౌళి తెరకెక్కించిన గత సినిమాల్లోని కొన్ని సీన్లు సైతం వివాదాల పాలవగా అప్పట్లో ఆ వివాదాలను రాజమౌళి పరిష్కరించుకున్నారు. అయితే ఎన్టీఆర్ టోపీ పెట్టుకున్న వివాదం గురించి మాత్రం ఇప్పటివరకు రాజమౌళి స్పందించలేదు.
సినిమా కథలో భాగంగా కొంతకాలం ఎన్టీఆర్ అజ్ఞాతవాసం ఉంటారని అందువల్లే ఆ సమయంలో టోపీ ధరిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భీమ్ కు టోపీ పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి గుణపాఠం తప్పదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైతే బరిగలతో కొట్టి చంపుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి దమ్ముంటే ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింకు కాషాయ కండువా వేసి సినిమా తీయాలని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…