Featured

Sarkaaru Vaari Paata : రెండవ రోజు కూడా పరవాలేదు అనిపిస్తున్న ‘సర్కార్ వారి పాట’ సినిమా కలెక్షన్లు…

Sarkaaru vaari paata : పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. రెండేళ్ళ తర్వాత మహేష్ బాబు నటించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి తమన్ సంగీతం దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఈ సినిమాపై భారీగా పెట్టుకున్న అభిమానుల అంచనాలను అందుకోలేక పోయిన కలెక్షన్లను బాగా రాబట్టింది. ఇక రెండవ రోజు నైజాంలో అధిక టికెట్ రేట్ల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ కనిపించకపోయినా కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్నాయి.

బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరం…?

సినిమా విడుదల అయి రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.58.78 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. నిన్న హాలిడే ఎఫెక్ట్ లేకపోయినా కలెక్షన్ బాగానే వచ్చింది. అయితే ఈరోజు, రేపు వీకెండ్ ప్రభావంతో కలెక్షన్ లు పెరిగే అవకాశం లేకపోలేదు. ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల ముందు రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఈ సినిమా ఇంకా రూ.62.22 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్స్ లో మంచి కలెక్షన్ లను రాబట్టి, వీక్ డేస్ లో కూడా సినిమా తన సత్తా చూపిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకోవచ్చు.

సర్కారు వారి పాట’ 2 డేస్ కలెక్షన్స్ ఇలా…

నైజాం రూ.17.44 కోట్లు

సీడెడ్ రూ.6.05 కోట్లు

ఉత్తరాంధ్ర రూ.6.27 కోట్లు

ఈస్ట్ రూ.4.33 కోట్లు

వెస్ట్ రూ.3.19 కోట్లు

గుంటూరు రూ.6.34 కోట్లు

కృష్ణా రూ.3.13 కోట్లు

నెల్లూరు రూ.1.97 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్) రూ.47.72 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.31 కోట్లు

ఓవర్సీస్ రూ.7.75 కోట్లు

వరల్డ్ వైడ్ (టోటల్) రూ.58.78 కోట్లు

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago