ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కరోనా బారినపడిన యజమానులు వారి ఇళ్లల్లో పెంచుకుంటున్న పిల్లులు, కుక్కలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తాజాగా యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజస్ కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనలో భాగంగా నెదర్లాండ్స్‌కు చెందిన ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం కోవిడ్ సోకిన వారి ఇళ్లలోని పెంపుడు కుక్కలకు, పిల్లుల రక్త నమూనాలను,గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించి పీసీఆర్, యాంటీబాడీ పరీక్షలను నిర్వహించగా అందులో 4.2శాతం పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 17.4శాతం రక్తంలోయాంటీబాడీలు కనిపించాయి.
ఈ విధంగా జంతువులలో కరోనా వ్యాప్తి చెంది నయం అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే కరోనా సోకిన యజమానుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఆ జంతువులతో పాటు నివసించే మరిన్ని జంతువులకు పరీక్షలు నిర్వహించగా వాటికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాలేదు.అంటే జంతువుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందదు కేవలం మనుషుల నుంచే జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు.కనుక కరోనా బారిన పడిన వారు పెంపుడు జంతువులకు కూడ దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…