Categories: FeaturedMovie News

Senior Actor Chandhra Mohan : శోభన్ బాబు ఎలా చనిపోయాడంటే… శవం పై పడి ఏడ్చేసాను..! నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి.. ముందు రోజే ఫోన్ చేసి చెప్పాడు…: చంద్ర మోహన్

Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావుగా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన చంద్ర మోహన్ గారు అనతి కాలంలోనే హీరోగా మంచి చిత్రల్లో నటించిన గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగానే కాకుండా , సహా నటుడుగా, కమెడియన్ గా ఎలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయిన ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ లో ఉన్న మధుర,చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

శోభన్ బాబు మృతి నన్ను బాధించింది…

సమాకాలిన నటులందరితోను మంచి స్నేహ సంబంధాలు ఉన్న చంద్ర మోహన్ గారు , శోభన్ బాబు గారితో ఎక్కువ స్నేహం ఉండేదంటూ చెప్పారు. వాళ్లిద్దరు ఏరా అని పిలుచుకునే వారట. చెన్నై నుండి తెలుగు ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడే ఉండటం వల్ల వారి స్నేహం మరింత బలపడింది. ఇక శోభన్ బాబు సడన్ గా మరణించడంతో చాలా బాధపడ్డాంటూ ఆనాటీ సంఘటనలను గుర్తు చేసుకుని చంద్ర మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు. మరణించడానికి ఒక రోజు ముందు ఫోన్ చేసి రేపు ఉదయం 11 గంటలకు ఇంటికి రా మాట్లాడాలి అనగా, 11 తరువాత కదా అని చంద్ర మోహన్ గారు ఉండగా మీడియా నుండి ఎవరో ఫోన్ చేసి శోభన్ బాబు గారి ఇంట్లో ఏదో ఆపశృతి జరిగిందని విన్నాము మీకు తెలుసా అన్నారు నేను ఏమైంది అంటే విషయం మాకు తెలియదు అనగానే నేను వెంటనే శోభన్ బాబు వల్ల ఇంటికి వెళ్లగా ఇల్లు నిర్మానుష్యంగా ఉంది ఇంట్లో వాళ్ళు దిగాలుగా కూర్చున్నారు అంటూ చెప్పారు .

ఏమయిందని ఇంట్లోవాళ్ళను అడిగితే పేపర్ చదువుతూ ఉన్నట్లుండి మెట్లమీద నుండి పడిపోయారని చెప్పారు. అంబులెన్సు లో హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పగానే షాక్ అయ్యను. తెరుకునే లోపే శవాన్ని ఇంటికి తీసుకువచ్చేసారు. ఇంటి నుండి తీసుకు వెళ్ళేటప్పుడే ఆయన మరణించాడని చెప్పారు అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్ర మోహన్. రోజు మాట్లాడుకునేవాళ్ళం సరదాగా కబుర్లు చెప్పుకున్న వన్నీ గుర్తొచ్చి శవం చూడగానే పడి ఏడ్చేసాను అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్ర మోహన్. ఇక శోభన్ బాబు కొడుకు చంద్ర మోహన్ గారిని అప్పుడప్పుడు ఇంటిక వచ్చి వెళ్ళండి అని చెప్పినా అక్కడికి వెళితే మేము కూర్చొని మాట్లాడిన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇంకా బాధేస్తుంది రాను చెప్పి వచ్చేసారట చంద్ర మోహన్ గారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago