Keerthi Suresh: నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వటంతో తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది .
మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందించకపోవడంతో ఈ వార్తలలో నిజం ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ…. తన కుటుంబ సభ్యులు తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఇంకా మంచి మంచి సినిమాలలో నటించాలని ఉన్నట్లు ఆమె వెల్లడించింది.
ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు వివరించడంతో వారు కూడా ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ.. తాను సినిమాలలో నటించటానికి అంగీకరించినట్లు కీర్తి సురేష్ వెల్లడించింది. ఇలా ఈ ఇంటర్వ్యూ ద్వారా తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబుకి జంటగా సర్కారు వారి పాట సినిమాలో నటించిన హిట్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…