Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావు అంటే ఎవరికీ తెలియదు కానీ చంద్ర మోహన్ అంటే మాత్రం అందరికి తెలుసు. హీరోగా, సహా నటుడుగా, కమెడియన్ గా ఎలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయిన ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ లో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
శ్రీదేవి ని ఐరన్ లెగ్ అన్నారు…. దాదాపు చాలా మంది హీరోయిన్స్ తో చేసాక….
చంద్ర మోహన్ గారు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే అప్పట్లో ఆయనతో మొదటి సారి నటించిన హీరోయిన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనే పేరుండేది. ఆయనతో తొలిసారి నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, మాధవి లాంటి ఎంతోమంది హీరోయిన్స్ ఆ తరువాత అగ్ర హీరోయిన్లు గా ఏదిగారు. ఇక ఈ విషయం గురించి చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ శ్రీదేవి ని మొదట పదహరేళ్ళ వయసు సినిమాకు వద్దని అనుకున్ననారు వేరే అమ్మాయిని అనుకున్న సమయంలో తమిళంలో ఆల్రడీ తానే చేసింది కానీ ఆమె నటించిన సినిమాలు కొన్ని ప్లాప్ అవడం వల్ల వద్దని ఐరన్ లెగ్ అని వద్దనుకున్న శ్రీదేవి వాళ్ళ అమ్మ చాలా అడిగి ఒప్పించుకున్నారు.
కానీ ఆ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అగ్ర హీరోయిన్ గా హిందీ సినిమా వైపు కూడా వెళ్లి అక్కడ నెంబర్ వన్ అయింది. కానీ అంత పై స్థాయికి వెళ్లిన కూడా ఒకసారి నేను కనబడితే కాళ్ళకు నమస్కారం చేసి పక్కన అమితాబ్ బచ్చన్ గారికి నన్ను పరిచయం చేస్తూ నా మొదటి సినిమా హీరో, ఈయన సినిమాలో చేశాకే నేను స్టార్ హీరోయిన్ అయ్యాను అంటూ చెప్పారు. గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ ఈయన అంటు శ్రీదేవి నే మొదట ఆ సెంటిమెంట్ గురించి చెప్పింది అంటూ చంద్ర మోహన్ గారు పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…