Senior Actor Chandhra Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలలో ఒదిగి పోయి ఆ తరం నటులతోను ఇటు ఈ తరం నటులనతోను అందరితోనూ నాతో నటించిన వ్యక్తిగా చంద్ర మోహన్ నిలిచిపోయారు. ఇంకొంచం పొడవు ఉండి ఉంటే చంద్ర మోహన్ ఒక పెద్ద హీరో అయ్యేవాడు అంటూ నాగేశ్వరావు గారు స్వయన అనడం చంద్ర మోహన్ గారి నటనకు అవార్డు లాంటిది. అప్పట్లో అగ్రహీరోలకు సమానంగా సినిమాలను చేస్తూ హిట్లు కొట్టారు చంద్ర మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
చిరంజీవి రెమ్యూనరేషన్ మొదట అంతే… అతని సక్సెస్ కి కారణం అదే….
చంద్ర మోహన్ గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారి దగ్గరి నుండి నేటి తారక్, చరణ్, నాగచైతన్య వంటి నేటి తరం హీరోలతో నటించారు. ఇక చిరంజీవి గారు ఆయనకు జూనియర్ అప్పటికే చంద్ర మోహన్ గారు హీరోగా చేస్తున్న రోజులు చిరంజీవి గారు చిన్న ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ప్రాణం ఖరీదు సినిమాలో ఇద్దరం నటించాం. అప్పుడు నా రెమ్యూనరేషన్ ఇరవై ఐదు వేలు కాగా, చిరంజీవి రెమ్యూనరేషన్ ఐదువేలు అంటూ చెప్పారు.
చిరంజీవి కఠోర శ్రమ, క్రమశిక్షణ, తపన తనని ఈ స్థాయిలో నిలబెట్టాయి అంటూ చెప్పారు. అయితే చిరంజీవి సక్సెస్ కి మరో ముఖ్య కారణం అల్లు అరవింద్ అంటూ చెప్పారు. ఇండస్ట్రీ లో చిరంజీవిని అర్జునుడు, అల్లు అరవింద్ ని కృష్ణుడు తో పోలుస్తుండేవారు. అల్లు అరవింద్ ఎలాంటి సినిమాలు చేయాలి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి అనే విషయాలలో చిరంజీవి ని బాగా గైడ్ చేసాడు అందుకే అతను నెంబర్ వన్ కాగలిగాడు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…