Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇక రాజకీయాలలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున తన పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా సభ ప్రాంగణంలో మాట్లాడే మాటల ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ సైతం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. సీఏ స్టూడెంట్స్ తో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో సిఏ విద్యార్థులను ఉద్దేశించి ఈయన ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన సినీ రాజకీయ జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియచేయడమే కాకుండా ఒకానొక సందర్భంలో తాను రాజకీయాలలో పూర్తిగా ఫెయిల్ అయ్యానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఇలా చెప్పడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం మొత్తం సీఎం అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తాను రాజకీయాలలో ఓడిపోయానని అయినా తాను ఏమీ బాధపడలేదని తెలిపారు.
చాలామంది ఈ సొసైటీ బాగుపడాలని కోరుకుంటారు కానీ తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారని తెలిపారు. కానీ తాను ఒక అడుగు ముందుకు వేసి సమాజం బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు. ఇకపోతే తాను రాజకీయాలలో ఓడిపోయాను అంటే విజయానికి సగం దూరంలో ఉన్నానని అర్థం. ఇక ఓడిపోయానని ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. విజయం అయినా ఓటమి అయిన రెండింటిని సమానంగా చూసినప్పుడే మనం జీవితంలో ఉన్నతంగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సీఏ విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…