Featured

Senior Actor Jhansi : అసలు మోహన్ బాబుకి అంత మార్కెట్ లేదు… ఆయన కూడా కోటి డిమాండ్ చేసాడు… సుమన్ సినిమా వల్ల ఆస్తులన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చేసా…: సీనియర్ నటి ఝాన్సీ

Senior Actor Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ. బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. ఎక్కువగా ఎన్టీఆర్ గారితోనూ, ఏఎన్ఆర్ తోనూ అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికి గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం వంటి సినిమాల్లో నటించిన ఝాన్సీ గారిని చూడాలి. ఎన్నో సినిమాల్లో నటించినా ఆర్థికంగా బాగా సంపాదించుకున్నా నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదీస్తున్నారు ఝాన్సీ. అప్పట్లో అగ్ర నటులతో పనిచేసిన ఝాన్సీ గారు అప్పటి అనుభవాలను, తన ఆస్తులన్నీ పొవడానికి గల కారణాలను పంచుకున్నారు.

ఆ సినిమాతో మొత్తం ఆస్తులు పోయాయి…

కొన్ని వందల సినిమాల్లో నటించిన ఝాన్సీ గారు ఆస్తులను బాగా సంపాదించారు. సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ మరో వైపు సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించిన ఝాన్సీ గారు ఎవరైనా సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే సినిమాల్లో పెట్టకండి అని సలహాలు ఇచ్చేవారట. అలాంటి ఝాన్సీ గారే ఒక దశలో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ‘ఖైదీ ఇన్స్పెక్టర్’ అనే సినిమాను తీసి బాగా నష్టపోయారు. సుమన్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అయినా చేతికి డబ్బులు రాలేదని చెప్పారు.

ఇక ఆ సినిమా కోసం మొదట మోహన్ బాబు గారిని హీరోగా అనుకుంటే మోహన్ బాబు ముందు సినిమాకు 90 లక్షలు తీసుకున్నాను ఈ సినిమాకు కోటి ఇవ్వండి అని అడిగారట. అయితే అప్పటికి మోహన్ బాబు కి కోటి మార్కెట్ లేదని వద్దనుకున్నారట. ఇక ఖైదీ ఇన్స్పెక్టర్ సినిమాను సుమన్ హీరోగా తీయగా అప్పటికి సుమ మార్కెట్ కోటిన్నర దాకా ఉంది. కానీ సినిమా హిట్ అయినా మాకు లాభాలు ఇవ్వలేదు అలా రోడ్డున పడ్డాను అంటూ వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago