Senior actor Lakshmikanth : యాభై ఏళ్ల క్రితం వచ్చిన ‘కన్నె వయసు’ సినిమా, ఆ సినిమాలోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటే. ఆ పాటలో నటించిన అనే కంటే జీవించిన నటుడు లక్ష్మి కాంత్ గారు. ఆయన ఆ సినిమా తరువాత చిలకమ్మ చెప్పింది, మంగళ్యానికి మరోముడి వంటి పలు సినిమాల్లో చేసినా ఆ పైన ఇండస్ట్రీ నుండి పక్కకు వచ్చేసారు. వ్యాపారాలను చేస్తూ బిజీ అయిన ఆయన మళ్ళీ చాలా ఏళ్లకు ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ కనిపించారు.
చెన్నై లో స్థిరపడి…
కన్నెవయసు సినిమాలో రోజా రమణి హీరోయిన్ కాగా హీరోగా లక్ష్మి కాంత్ గారు నటించారు. అయితే ఆయన మొదటి సినిమా కన్నె వయసు కాదు, ఆయన మొదటి సినిమా వేరే కాగా ఆ సినిమాలో అంత గుర్తింపు రాలేదు. కన్నె వయసు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆసినిమా తరువాత కే విశ్వనాథ్ గారు, బాలచంధర్ గారు ఇలా గొప్ప దర్శకుల వద్ద పనిచేసారు లక్ష్మి కాంత్ గారు.
ఇండస్ట్రీలో సుమారు పదేళ్ళు ఉన్న ఆయన అవకాశాలు కొంత తగ్గిన తరువాత ఇండస్ట్రీ నుండి బయటికి వచ్చి వ్యాపారాలను చేసారు. చెన్నై లోనే బాగా సెటిల్ అయిన ఆయనకు ఇద్దరు కూతుర్లు కాగా ఇద్దరు కూతుర్లకు కలిసి నలుగురు ఆడపిల్లలు, వాళ్లలో ఇద్దరు డాక్టర్స్ గా సెటిల్ కాగా మరో ఇద్దరు సాఫ్ట్ వేర్స్ గా సెటిల్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…