Maharshi Raghava: సీనియర్ నటుడు మహర్షి ఇంట విషాదం… సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు!
Maharshi Raghava: టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా పలు చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
అనారోగ్య కారణంగా కమలమ్మ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమెకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రాఘవ సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న కుమారుడు వెంకట్ ఆయన అమెరికాలో స్థిరపడ్డారు.
బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన కమలమ్మ అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఈమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాఘవ తల్లి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
సీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన మహర్షి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాఘవ ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు.ఇలా ఈ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వరుస సినిమాల్లో నటించారు. ఇలా సుమారు 150 చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…