Senior Actor Murali Mohan : తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు మురళి మోహన్ గారు. వ్యాపారం చేసుకుంటూ ఉండి సినిమాల్లోకి వచ్చిన మురళీ మోహన్ గారు, చిన్న చిన్న సినిమాలతో తన ప్రయాణం మొదలుపెట్టి, తన నటనతో అలరించారు. జయభేరి ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలను కూడా తీశారు. ఇక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి అక్కడ రాణించారు.
నాగేశ్వరావు గారు నాకు మందు అలవాటు చేసుకోమన్నారు….
సినిమాల్లోకి రావడానికి చాలా ఆలోచించానని, వ్యాపారం చేసే వాడికి సినిమాల్లోకి వెళితే అక్కడ సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటనే మీమాంసలో చాలా రోజులు ఉన్నానని ఇక సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక సిగరెట్, మధ్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిబంధన నాకు నేనే పెట్టుకుని సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. అయితే ఒక సందర్బంలో నాగేశ్వరావు గారు రాత్రికి ఏమి తాగుతావ్ అని అడిగారు, నేను తాగానని చెప్పగా 60 దాటాక శరీరంలోని నరాలు అదుపులో ఉండవని కొంచెం తాగితే మంచిదని చెప్పగా, అంత పెద్దవారు చెప్పారు కదా అని కొన్నిరోజులు తాగాను కానీ నచ్చక మానేశాను. ఎపుడైనా పార్టీలలో కొంచెం తాగుతాను అంతే అని వివరించారు మురళి మోహన్.
కేవి చలం మృతదేహం చూసి…
చాలా సినిమాల్లో హీరోగా కమెడియన్ గా నటించిన చలం రైలు పట్టాలపైన శవంగా కనిపించినప్పుడు తట్టుకోలేక పోయాను అంటూ మురళి మోహన్ వివరించారు. ఆరోజు నేను, మోహన్ బాబు చలం కోసం వెతికాము. చివరికి రైలు పట్టాలపై కనిపించాడు. ఇక చలం అంత్యక్రియలు దాసరి గారు చాలా బాగా చేసారు. కొన్నేళ్లు ఆయన మరణం గుర్తుకువచ్చేది అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…