Senior actress Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గానూ అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోనూ ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్ ఇలా అందరు హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
చిరంజీవితో చేయమని హీరోయిన్స్ అనేవారు…
పునాదిరాళ్ళు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గారితో ఆ తరువాత వెంకన్న బాబు గారు చేసిన సినిమా ఊరికిచ్చిన మాట లో హీరోయిన్ గా చేయడానికి అప్పటి హీరోయిన్స్ అంగీకరించకపోవడం వల్ల కవిత గారికి ఆఫర్స్ వచ్చాయట. అలా వరుసగా సినిమాలను చిరుతో చేశారట. ఊరికిచ్చిన మాట, శ్రీరస్తు శుభమస్తు, ఆరని మంటలు, తాతయ్య ప్రేమలీలలు ఇలా వరుసగా చేశారు. ఆ తరువాత మళ్ళీ చిరంజీవి గారి కాంబినేషన్ లో చేయలేదని తెలిపారు కవిత. చిరంజీవి గారికి స్టార్ డమ్ వచ్చాక ఇక నన్ను హీరోయిన్ గా చేయలేదు అంటూ తెలిపారు. ఇక బాలకృష్ణతో నటించే అవకాశం రాలేదంటూ కవిత గారు చెప్పారు.
కవిత హీరోయిన్ గా చేస్తున్న సమయంలో బాలకృష్ణ ఇంకా ఎక్కువగా సినిమాలను చేస్తూ లేడని చెప్పారు. ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తున్నపుడు బాలకృష్ణ, హరికృష్ణ షూటింగ్ సెట్స్ కి వచ్చేవారు, సినిమాకు సంబంధిచిన పనులను చూసుకునేవారు, అయితే మేకప్ లో ఎపుడూ బాలయ్యని చూడలేదు. ఆయన హీరో అయ్యాక అప్పటికే డైరెక్టర్స్ కోదండ రామిరెడ్డి వంటి వాళ్ళు వచ్చేసారు. హీరోయిన్స్ విజయశాంతి, రాధ, భానుప్రియా వచ్చేసారు అందువల్ల ఆయనతో చేసే వీలుపడలేదు అంటూ చెప్పారు. అప్పటికి నేను ఇండస్ట్రీ నుండి కొంచం గ్యాప్ తీసుకున్నాను అంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…